5 July, 2026 | 7:32 PM

బుర్రకథ కళాకారిణి కథతో..

24-12-2024 12:00 AM

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కతి ప్రసాద్ నిర్మించే కొత్త చిత్రంలో ముఖ్య పాత్రను పోషించనున్నారు. ‘గరివిడి లక్ష్మి’ టైటిల్ తో రూపొందనున్న సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనిలో జరిగింది. షూటింగ్ ప్రారంభానికి ముందే సినిమాను సెలబ్రేట్ చేయడం ద్వారా సినిమా ప్రమోషన్‌లలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.

ఈ చిత్రం ఉత్తర ఆంధ్రాకు చెందిన ఐకానిక్ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి స్ఫూర్తిదాయకమైన కథను, మహిళల గుర్తింపు ఇతివృత్తం ఆధారంగా రూపొందుతోంది. ఎమ్మెల్యే పార్ధసారధి ఫస్ట్ క్లాప్ కొట్టగా, ఎమ్మెల్సీ మధు, మల్లప్ప నయాకర్ కెమెరా స్విచాన్ చేశారు. జనవరి మూడో వారంలో ఆదోనిలో సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. నరేష్ , రాశి, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు.