5, 6 తేదీల్లో అమ్మ పేరుతో ఒక్క మొక్క
- బలిదాన్‌దివస్ సందర్భంగా బీజేపీ పిలుపు
5 లక్షల మొక్కలు లక్ష్యం: యెండల లక్ష్మీనారాయణ
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా అమ్మ పేరుతో మొక్కలు నాటేలా గొప్ప కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చింది. తెలంగా ణలో మొత్తం 5 లక్షల మొక్కలు నాటేలా రాష్ట్ర పార్టీ లక్ష్యాన్ని నిర్దేశించినట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండ ల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్ర మం విజయవంతానికి పార్టీలో వివిధ కమిటీలను నియమించినట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
శని, ఆదివారాల్లో రాష్ర్టవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి, డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ బలిదానం గురించి ప్రజలకు వివరించి, అలాగే మొక్క లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వాటిని జులై 5, 6 తేదీల్లో ప్రతి బూత్ స్థాయిలో నాటేలా చూస్తామని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం 2019లో ఆర్టికల్ 370 తొలగించి జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో కలపడం ద్వారా దేశాన్ని ఒక బలమైన ఐక్యదేశంగా చూడాలనే డాక్టర్ ముఖర్జీ కలను సాకారం చేశారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి రాణిరుద్రమ, తదితరులు పాల్గొన్నారు.






