calender_icon.png 30 August, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాలే గోల చేసే తీరాన..

11-07-2024 12:05:00 AM

అవినీతిని తనిఖీ చేసి అక్రమ సొమ్ముని వెలికితీయాల్సిన రవితేజ.. ఎదురుగా హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సె కనపడేసరికి “గుట్టుగున్న పుట్టుమచ్చ ఎక్కడమ్మ?” అంటూ పాత్ర స్వభావాన్ని కనబరిచారు. అది బయటపడిందో లేదో ఆయనకే తెలియాలి. తర్వలో ‘మిస్టర్ బచ్చన్’గా థియేటర్లలో సందడి చేయనున్న రవితేజ, హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆదాయపన్ను శాఖ అధికారిగా కనపడనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మిక్కీ జే మేయ ర్ స్వరచపరిన ఓ పాట తాజాగా విడుదలైం ది. “చిట్టి గువ్వ పిట్ట లాంటి చక్కనమ్మ.. బొట్టి పెట్టి పట్టుచీర కట్టుకోమ్మ” అంటూ గేయ రచయిత సాహితి రాసిన ఈ గీతాన్ని గాయకులు సాకేత్ కొమండూరి, సమీ ర భరద్వాజ్ ఆలపించారు. చారులత మణి శాస్త్రీ య స్వరాలనూ ఈ పాటలో వినవచ్చు. ఈ పాటకి మిక్కీ అందించిన బాణీ విన్న సంగీత ప్రియులు 90ల్లో పాటలు గుర్తొస్తున్నాయని మురిసిపో తున్నారు. విడుదలవడం ఆలస్యం.. సినిమాకి ప్రధాన ఆకర్షణగా మారింది ఈ పాట. కథానాయికతో చీరకట్టుకొమ్మని చెబుతూ పాట ఆరంభించిన రచయిత ‘గాలే గోల చేసే తీరాన.. నీ కుచ్చిలి మార్చి ముచ్చట తీర్చేనా?’ వంటి పదబంధాలతో ఈ స‘రస’ గీతాన్ని రక్తి కట్టించారు.