న్యాయం కోసం రెండు భిన్న దారుల్లో..
జంగ్లీ పిక్చర్స్, జయంతీలాల్ గడా నిర్మిస్తున్న ‘డాయ్రా’ చిత్రంలో ప్రధాన పాత్రధారులుగా కరీనాకపూర్‌ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ (Meghna Gulzar) దర్శకత్వం వహించగా, కథను యష్ కేస్వానీ, సీమా అగర్వాల్, మేఘనా గుల్జార్ కలిసి అందించారు.
ఈ మూవీ ట్రైలర్ సోమవారం విడుదలైంది. నిజం ఎప్పుడూ ఒకేలా ఉండదని, న్యాయం ఎవరి కోణంలో వారు ఎలా అర్థం చేసుకుంటారనేదానిపై ఆధారపడి ఉంటుందని, ప్రతి నిర్ణయం వెనుక ఓ ఘటన ఉంటుందనే అంశాలను ఈ ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు.
నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ కథలో ఒకే కేసులో రెండు వ్యతిరేక వైపులా నిలిచిన ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులు కరీనా, పృథ్వీరాజ్ సుకుమారన్.. ఏది తప్పు, ఏది ఒప్పు అనే ఆలోచనకే సవాల్ విసిరే పరిస్థితులను ఎదుర్కొంటారు. ఈ మూవీ సెప్టెంబర్ 18న విడుదల కానుంది.






