1 September, 2026 | 3:07 AM

సెమీ కండక్టర్ తయారీలో పెట్టుబడులను ప్రోత్సహించండి

01-09-2026 02:28 AM
  1. ‘తెలంగాణ జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి
  2. జర్మన్ ఇండియన్ బిజినెస్ అలయన్స్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి) : సెమీ కండక్టర్ తయారీ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ కంపెనీల ను ప్రోత్సహించాలని జర్మన్ ఇండియన్ బిజినెస్ అలయన్స్ (జీఐబీఏ) ప్రతినిధులను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Duddilla Sridharbabu) కోరారు.

రాష్ట్రాన్ని సెమీ కండక్టర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా(Semiconductor Manufacturing Hub) తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. కెల్‌స్టర్ బాక్ నగర మేయర్ మాన్‌ఫ్రెడ్ ఓకె ల్ నేతృత్వంలో జీఐబీఏ ప్రతినిధులు సోమవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బా బును మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్రం లో సెమీ కండక్టర్స్, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, అడ్వానస్డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ప్రెసిషిన్ ఇంజినీరింగ్, ఆటోమొ బైల్, ఆటోమేషన్ తదితర రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనుకూలతలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు వారికి వివరించారు.

పరిశ్రమల ఏర్పాటుకు వేగవంతమైన అనుమతులు, మౌలిక వసతులు, పెట్టుబడి ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో పూర్తి సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. జర్మనీ కంపెనీల అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రెసిషన్ ఇంజినీరింగ్, అడ్వాన్స్‌డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలను తెలంగాణలోని టాలెంట్ పూల్, ఇండ స్ట్రీ ఎకోసిస్టంతో అనుసంధానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

రాష్ట్రం నుంచి ఎగుమతులు జర్మనీ, యూరప్ మార్కెట్లకు సుల భంగా చేరేలా ప్రత్యేక లాజిస్టిక్ కారిడార్ ఏ ర్పాటుకు చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7,8,9 తేదీల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజిం గ్ గ్లోబల్ సమ్మిట్ 2026’పై జర్మనీ పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని విజ్ఞ ప్తిచేశారు.

కార్యక్రమంలో జీఐబీఏ చైర్మన్ సెల్వకుమార్ పెరియసామి, సీఈవో నిర్మల్ రామన్ కన్నయ్యన్, ఇన్నోవేషన్ హబ్ రైన్‌మెయిన్ సీఈవో స్టెఫాన్ విట్కిండ్ట్, ఎఫ్టీసీసీ ఐ ప్రతినిధులు కేకే మహేశ్వరి, శ్రీనివాస్ గరిమెళ్ల, వినోద్ కుమార్ అగర్వాల్, లోకేష్ ఫతేపురియా పాల్గొన్నారు.