మరో అవకాశం మిస్!
ఇండస్ట్రీకి అచ్చొచ్చిన సామెత.. ‘దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం’. ముద్దుగుమ్మలంతా దీనిని చక్కగా ఫాలో అవుతుంటారు. అయితే శ్రద్ధా కపూర్ బాలీవుడ్ భామ కావడంతో ఈ సామెత గురించి తెలిసినట్టు లేదు. అందుకే వచ్చిన అవకాశాలన్నీ కాలదన్నుకుంటున్నారు. ‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు శ్రద్ధా కపూర్ పరిచయమయ్యారు. సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకున్నా కూడా ఈ అమ్మడికి మాత్రం టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో మేకర్స్ కొందరు తమ సినిమాల కోసం శ్రద్ధాను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే రెమ్యూనరేషన్ కారణంగా ‘పుష్ప 2’ అవకాశాన్ని పోగొట్టుకున్న ఈ భామ తాజాగా మరో అవకాశాన్ని సైతం చేజార్చుకున్నారని తెలుస్తోంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఓ సిని మా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రద్ధాను తీసుకోవాలని భావించిన మేకర్స్ ముందు గా ఆమెను సంప్రదించారట. కానీ ఆమె అడిగిన రెమ్యూనరేషన్ భారీగా ఉండటంతో వారు సైలెంట్‌గా వెనుదిరిగారని ప్రచారం జరుగుతోంది.






