22 March, 2026 | 5:54 AM

వాగులో గల్లంతై ఒకరి మృతి

22-07-2024 12:14 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 21 (విజయక్రాంతి): వాగులో గల్లంతై ఒకరు మృతిచెందిన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని దహెగాం మండలం ఇట్యాల గ్రామానికి చెందిన కొట్రంగి సంతోష్(35) బహిర్భూమికని గ్రామ సమీపంలోని బొక్కి వాగు సమీపంలోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతయ్యాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు, ఆచూకీ కోసం గాలించగా వాగు దిగువ ప్రాంతంలో సంతోష్ మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య గంగుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు. సంతోష్‌కు ఇద్దరు కొడుకులున్నారు.