22 March, 2026 | 7:46 AM

కడెం నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

22-07-2024 12:13 AM

నిర్మల్, జూలై 21(విజయక్రాంతి): రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నుంచి కుడి, ఎడుమ కాలువలకు నీటిని విడుదల చేశారు. మొదటగా ప్రాజెక్టును సందర్శించి నీటి నిలువ, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్వహణపై అధికా రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కడెం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోవడంతో ప్రమాదం జరిగిందన్నారు. అటువంటి ఘటనలు పున రావృతం కాకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఆయనవెంట నీటి పారుదల అధికారులు శ్రీనివాస్ బోజదాస్, విట్టల్, ప్రజాప్రతినిధులు ఉన్నారు.