హక్కులతో పాటు బాధ్యతను కలిగి ఉండాలి: ఎస్పీ
ఇల్లెందు, ఏప్రిల్ 16, (విజయక్రాంతి): హక్కులతో పాటు ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతను కలిగి ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. గురువారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇల్లందు పట్టణంలోని అయిత కాంప్లెక్స్ నందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. వాహనం నడిపే ప్రతి పౌరుడు డ్రైవింగ్ లైసెన్సు, వాహనం ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఆర్ సి కాగితాలను కలిగి ఉండాలని, రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాహనం నడపాలన్నారు.
ఆరైవ్ ఆ లైవ్ అనేది ఒక కార్యక్రమం కాదని ఇది ఒక ఉద్యమం అని దీనిని పోలీస్ శాఖ రవాణాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపర్డెంట్ చరణ్ సింగ్, మున్సిపల్ చైర్మన్ కిరణ్ మిత్ర, సింగరేణి జిఎం వీసం కృష్ణయ్య, కమిషనర్ ఎస్.గణేష్, తహసీల్దార్ సూర్య ప్రకాష్ రావు, ఎంపీడీవో ధన్ సింగ్, 22వ వార్డు కౌన్సిలర్ కోర్ల పాటి శివ కిరణ్, డీఎస్పీ వెంకన్న బాబు, హౌసింగ్ ఏఈ స్వాతి, సీఐలు తాటిపాముల సురేష్, బత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు.






