17 April, 2026 | 3:22 AM

ఎస్సీ వర్గీకరణలో లోపాలను సరిదిద్దాలి

17-04-2026 12:00 AM

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోవింద్ నరేష్ మాదిగ

ముషీరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణలో జరిగిన లోపా లను వెంటనే సరిదిద్దాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోవిందు నరేష్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 3 కోట్ల 54 లక్షల జనాభాలో 36 లక్షల 50 వేల మాదిగ జనాభా ఉన్నదని, జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణలో 10 నుంచి 11 శాతం వరకు వాటా రావాలని అన్నారు.

కానీ తొమ్మిది శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించిందని ఆయన ఆరోపించారు. జనాభా లెక్కల ప్రకారం మాదిగలకు ఎస్సీ వర్గీకరణలో 11% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మాదిగ జాతికి అన్యా యం చేశానని సీఎం రేవంత్ రెడ్డికి తెలుసన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బైరపోగు శివకుమార్ మా దిగ, నాయకులు పల్లెర్ల సుధాకర్, అరుణ్,  ఎంఎస్పీ నాయకులు చిప్పలపల్లి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.