calender_icon.png 5 July, 2025 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే నామం అన్నిటికీ సమాధానం!

05-07-2025 12:52:00 AM

హోంబలే ఫిల్మ్స్ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక వెంచర్ ‘మహావతార్: నరసింహ’. ఈ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ కోసం క్లీమ్ ప్రొడక్షన్స్‌తో చేతులు కలిపింది. పురాణాల్లోని విష్ణుమూర్తి దశావతారాల నేపథ్యంలో తెరకెక్కుతున్న విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ ఇది. ఈ ఫ్రాంచైజీలో మొదటిది ‘మహావతార్: నరసింహ’ జూలై 25న ఐదు భారతీయ భాషల్లో 3డీ ఫార్మాట్‌లో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వరుస వీడియోలను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ప్రహ్లాదుడి పాత్రకు సంబంధించి వీడియోను పంచుకున్నారు. ‘ఒకే నామం అన్నిటికీ సమాధానం’ అంటూ విష్ణువుపై తన భక్తిని చాటే ప్రహ్లాదుడి మాటలు ఆకట్టుకుంటున్నాయి. దీనికి అశ్విన్‌కుమార్ దర్శకుడు కాగా, శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మిస్తున్నారు.