05-07-2025 12:50:47 AM
పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏ దయాకర్‌రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఎం రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో నిధిఅగర్వాల్, బాబీడియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తం రెండు భాగాల్లో రూపొందుతున్న ఈ సినిమా పార్ట్-1 షూటింగ్ దాదాపు పూర్తయింది.
మరోవైపు పోస్ట్ -ప్రొడక్షన్, వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతోంది. తొలిభాగం జూలై 24న రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా రెండో భాగానికి సంబంధించి ఓ గాసిప్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పార్ట్-2లో రామ్‌చరణ్ ఒక స్పెషల్ రోల్‌లో కనిపించబోతున్నారు.
చరణ్ పాత్ర ఒక కీలకమైన ట్విస్టును తీసుకొస్తుందని, అది సినిమా స్థాయిని మరో స్థాయికి చేర్చుతుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి రెండో భాగంలో చరణ్ రోల్ ఉంటుందా.. లేదా? అనే విషయమై మూవీ యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ పవన్‌కళ్యాణ్, రామ్‌చరణ్ స్క్రీన్ పంచుకోనునన్నారనే వార్త నిజమైతే, బాబాయ్ అబ్బాయ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూసే భాగ్యం అభిమానులకు దక్కనుంది.