calender_icon.png 5 July, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజర్‌తో చిత్ర విజయంపై నమ్మకం పెరిగింది

05-07-2025 12:54:00 AM

అలనాటి ‘రక్త కన్నీరు’ నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ హీరోగా బిగ్‌బాస్ ఫేమ్ రోహిత్ సహా ని జంటగా వస్తున్న చిత్రం ‘మిస్టీరియస్’. మహి కోమటిరెడ్డి దర్శకత్వం లో ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా, శివాని నిర్మిస్తున్న ఈ సినిమాలో రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ ప్ర ధాన పాత్రల్లో కనిపించనున్నారు. తా జాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన టీజ ర్ లాంచ్ కార్యక్రమంలో నాయకానాయికలు అబిద్ భూషణ్, రోహిత్ సహాని మాట్లాడుతూ..

“ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. టీజర్‌కు కూడా మంచి అప్లాజ్ రావడం ఆనందంగా ఉంది” అన్నారు. డైరెక్టర్ మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ “సస్పెన్స్ జానర్‌లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంది.

టీజర్‌కు వచ్చిన స్పందనతో సినిమా సక్సెస్‌పై మరింత నమ్మకం పెరిగింది” అని తెలిపారు. ‘సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులకు వినోదం పంచుతాం’ అని నిర్మాతలు చెప్పారు. ఇంకా ఈ ఈవెంట్‌లో చిత్రబృందం అంతా పాల్గొన్నారు.