బాధ్యతతో పనులు చేస్తేనే సముచిత స్థానం
అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
చిన్న చింత కుంట, జూలై 29 : అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా చేస్తేనే సముచిత స్థానం లభిస్తుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. బుధవారం సి.సి.కుంట మండలం ముచ్చింతల జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను సందర్శించారు. గుంతల తవ్వకం, మొక్కల నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో ఎస్‌ఐఆర్ ను 100 శాతం పూర్తి చేయడంలో విశేష కృషి చేసిన బూత్ లెవల్ అధికారులను ఈ సందర్భంగా ఆయన అభినందించి సన్మానించారు.
అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యా ప్రగతి, అభ్యాస అనుభవాలు, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించాలని, క్రమశిక్షణతో వ్యవహరించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు.






