16 May, 2026 | 2:11 AM

ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలి

16-05-2026 12:00 AM

పిట్ల నగేష్ ముదిరాజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ ఈటల రాజేందర్

సికింద్రాబాద్, మే15 (విజయక్రాంతి): ఉచిత వైద్య సేవలను పేద మధ్యతరగతి కుటుంబాల వారు సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కంటోన్మెంట్ పరిధిలో మోండా డివిజన్ వెస్ట్ మారేడుపల్లిలో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవాసమితి అధ్యక్షులు, బీజేపీ ఓబీసీ కోఆర్డినేటర్ పిట్ల నగేష్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. నగేష్‌కు శాలువా కప్పి, కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవాసమితి అధ్యక్షులు పిట్ల నాగేష్ ముదిరాజ్, ఆర్‌వీఎం చారిటబుల్ ట్రస్ట్ మెగా మల్టీ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరాన్ని రాజేందర్ ప్రారంభించారు. 

ప్రముఖ వైద్యులు బీపీ, షుగర్, ఆరోగ్య తదితర జనరల్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించడంతో పిట్ట నగేష్ ముదిరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు నగేష్ ముదిరాజ్‌కు పూలబోకే అందజేసి, శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.