17 July, 2026 | 9:10 PM

Breaking News

మైనార్టీ గురుకుల ఉద్యోగులపై జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ. రూ.5.62 లక్షల ఫైన్   •   రోగుల సేవలకు మరింత బలం   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •  

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

18-05-2026 02:38 AM

ములుగు (మహబూబాబాద్) మే 17 (విజయక్రాంతి): చదువుతో పాటు క్రీడలు యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ములుగు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు.

జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, డీఎస్పీలు, ఏఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు క్రీడల నిర్వహణకు చేసిన కృషిని ప్రశంసించారు. పోటీల్లో పాల్గొన్న ఏటూరునాగారం, ములుగు డివిజన్ క్రీడాకారులను అభినందిస్తూ, ఈసారి విజయం సాధించని వారు నిరుత్సాహపడకుండా తదుపరి పో టీల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.

ములుగు జిల్లా వెనుకబడిన ప్రాంతంగా కనిపించినా రామప్ప, మేడారం, లక్నవరం, బొగత జలపాతం, గోదావరి పరివాహక ప్రాంతం వంటి అపార సహజ, చారిత్రక సంపద కలిగిన ప్రాంతమని పేర్కొన్నారు. యువత క్రీడలతో పా టు చదువుపై కూడా దృష్టి సారించాలని, రాబోయే నోటిఫికేషన్ల దృష్ట్యా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.   ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సబ్ డివిజన్ ఏఎస్పీ మనన్ భ ట్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు డిఎస్పి రవీందర్, స్థానిక సిఐలు ఎస్‌ఐలు జిల్లాకు సంబంధించిన పోలీస్ అధికారులు  పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.