11 April, 2026 | 2:57 AM

ఆయుర్వేద, హోమియోపతి, యునాని సేవలు వినియోగించుకోవాలి

11-04-2026 12:57 AM

జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

మహబూబాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్య సేవలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్  స్నేహ శబరిష్ కోరారు. శుక్రవారం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఆయుష్ దినోత్సవం నిర్వహించారు.

ఆయుర్వేద, హోమియో, యునాని వైద్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలలు, హాస్టల్లల్లో యోగా శిక్షణ తరగతులు ఉదయం 6:30 నుంచి 7:30 వరకు నిర్వహించామని,.అదేవిధంగా గ్రామస్థాయిలో ఆయుర్వేద హోమియో యునాని వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు.

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరంలో హోమియోపతి వైద్యులు చైతన్య, రామకృష్ణ, ఆయుర్వేద వైద్యులు పి కిరణ్ కుమార్, వసుంధర దేవి, యునాని వైద్యులు బి శంకర్ డిపిమం శ్రవణ్ కుమార్, సిబ్బంది ఇందుమతి, పద్మ, అశోక్, సజయ్, మోహన్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రవి రాథోడ్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ప్రసాద్, డాక్టర్ పి కిరణ్ కుమార్, జిల్లా ఆయుష్ ,శ్రవణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.