24 April, 2026 | 4:41 PM

Breaking News

గర్భిణీ స్త్రీలకు చిన్నారులకు అంగన్వాడిల ద్వారా సేవలు అందించాలి   •   మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి: సర్పంచ్ ఆడారపు హరికృష్ణ   •   దళితుల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించండి   •   పేదల పెన్నిధి - సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి   •   ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎంపీడీవో   •   పాసయ్యమన్న ఆనందం బడికి దూరం అవుతున్నామన్న బాధ   •   సొంతింటి కల నెరవేర్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిదే   •   శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. సర్కార్ చేసిన హత్యే   •   రీస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడికి అభినందనలు   •   ఆమ్‌ ఆద్మీ పార్టీకి బిగ్‌ షాక్.. బీజేపీలోకి రాజ్యసభ సభ్యులు   •  

ఒక్క అడుగు

02-12-2024 12:00 AM

ఒక్క అడుగు

నీ పాదము మోపిన వేళ 

నిగనిగలాడే నల్ల బంగారం

నిన్ను చూసి మురిసి మురిసి 

తన విలువను తెలిపింది 

ఎద్దులేని ఎవుసం నీవు చేసే

ప్రకృతి సేద్యం పుడమితల్లికి 

మహాభాగ్యమనిపించింది 

గాలికి కదలని దీపాలు 

చీకటి చీల్చుకుంటూ 

రేపటి రంగురంగుల ఇంద్రచాపాలై

నిన్ను ఆకాశానికి చూపాయి 

అంతరిక్షానికి ఆదిమానవునికి

ఏదో ఋణానుబంధమే ఉంది

కాలం మహిమ ఏమో కానీ 

కదులుతున్న ప్రతిక్షణం 

మానవుని ఊపిరికి శ్వాసలా

నిరంతరం నిన్ను పరీక్షింపచేస్తుంది

ఒక్క అడుగు చాలు

నీ పయనం మొదలవటానికి 

గతించిన ఎన్నో దారులు 

నిన్ను కనుక్కోమని నీ మనసులో 

బీజం వేస్తుంది 

అడుగు వెనక అడుగువేస్తున్న

జనాల బాటకి సూత్రధారి నీవేనని 

నీ నేత్ర దర్శనం సుదీర్ఘమైతే 

సకలజనాలకు సౌభాగ్యమైతే

ఆ ఒక్క అడుగే అనంతాలకు 

అదృష్టరేఖ అవుతుంది 

ఏమీ తెలియని పసిపాపల

చిరునామాకి పునాది అవుతుంది 

ఒక్క అడుగే భావితరాల 

బంగారు భవిత అవుతుంది.





నీ పాదము మోపిన వేళ 

నిగనిగలాడే నల్ల బంగారం

నిన్ను చూసి మురిసి మురిసి 

తన విలువను తెలిపింది 

ఎద్దులేని ఎవుసం నీవు చేసే

ప్రకృతి సేద్యం పుడమితల్లికి 

మహాభాగ్యమనిపించింది 

గాలికి కదలని దీపాలు 

చీకటి చీల్చుకుంటూ 

రేపటి రంగురంగుల ఇంద్రచాపాలై

నిన్ను ఆకాశానికి చూపాయి 

అంతరిక్షానికి ఆదిమానవునికి

ఏదో ఋణానుబంధమే ఉంది

కాలం మహిమ ఏమో కానీ 

కదులుతున్న ప్రతిక్షణం 

మానవుని ఊపిరికి శ్వాసలా

నిరంతరం నిన్ను పరీక్షింపచేస్తుంది

ఒక్క అడుగు చాలు

నీ పయనం మొదలవటానికి 

గతించిన ఎన్నో దారులు 

నిన్ను కనుక్కోమని నీ మనసులో 

బీజం వేస్తుంది 

అడుగు వెనక అడుగువేస్తున్న

జనాల బాటకి సూత్రధారి నీవేనని 

నీ నేత్ర దర్శనం సుదీర్ఘమైతే 

సకలజనాలకు సౌభాగ్యమైతే

ఆ ఒక్క అడుగే అనంతాలకు 

అదృష్టరేఖ అవుతుంది 

ఏమీ తెలియని పసిపాపల

చిరునామాకి పునాది అవుతుంది 

ఒక్క అడుగే భావితరాల 

బంగారు భవిత అవుతుంది.


 బొమ్మిదేని రాజేశ్వరి