02-12-2024 12:00:00 AM
అప్పుడెప్పుడో నాయిన
పోసిన దారి
ఇంకా ఆరిపోకుండా
వెలుతురు కాస్తునే ఉంది
వెన్నెల పూస్తూనే వుంది
చేయూతనందిస్తుంది
నాయినా ఆ దారికోసం
ఎంత సాగు చేసిండో
ఎన్ని కంపముళ్ళను
తన శరీరంలో గుచ్చుకుండో
ఎన్ని నిద్ర లేని రాత్రులు
గడిపిండో
ఏ అయ్యల మాటల కొరడాల
దెబ్బలు తిన్నడోగానీ
ఇప్పుడవి నా జీవనరేఖలై
వెలుగుతున్నవి
చల్లని వెన్నెల కాస్తున్నాయి
నన్ను అక్కున చేర్చుకుంటున్నాయి
నాకు తోడై నీడ నిస్తున్నాయి
నాయినను ఎప్పుడూ పలకరిస్తూ
నాయినకు బదులుగా.
- గుండెల్లి ఇస్తారి