calender_icon.png 26 October, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీతవారిగూడెంలో ఊటీ ఫిల్టర్ కాఫీ టీ స్టాల్ ప్రారంభం

26-10-2025 08:24:00 PM

అధిక సంఖ్యలో పాల్గొన్న యువత, గ్రామ పెద్దలు..

గరిడేపల్లి (విజయక్రాంతి): మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఊటీ ఫిల్టర్ కాఫీ టీ స్టాల్ ను గ్రామ పెద్దలు, యువత సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. కోదాడ, మిర్యాలగూడ ప్రధాన రహదారిపై బాటసారులు, గ్రామస్తులకు సౌకర్యవంతంగా ఉండే ప్రదేశంలో ఈ టీ స్టాల్ ప్రారంభించబడింది. ఈ సందర్భంగా ప్రోప్రైటర్ మైలార్శెట్టి రాజీవ్ మాట్లాడుతూ.. బాటసారులు, గ్రామ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఊటీ ఫిల్టర్ కాఫీ అందించడమే మా లక్ష్యం అని తెలిపారు. గ్రామస్థులు మాట్లాడుతూ, “గ్రామంలో ఇలాంటి ఆధునిక కాఫీ స్టాల్ ఏర్పాటు కావడం సంతోషకరం. ఇది యువతకు, బాటసారులకు విశ్రాంతి తీసుకునే మంచి ప్రదేశంగా మారనుంది” అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కాఫీ రుచి చూసి సంతోషం వ్యక్తం చేశారు.