26-10-2025 08:26:37 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన నలువల సుధాకర్ గత 20 సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం ద్వారా వరి, కూరగాయలు, పప్పు దినుసులు, ఎద్దు గానుగ నూనె, మిరప, పసుపు, వంటి పంటలు పండిస్తూ, గ్రామ రైతులలో పెద్దపల్లి రైతు ఉత్పత్తి సంస్థ ఏర్పాటు చేసి రైతులకు వివిధ రకాల సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సుధాకర్ చేస్తున్న సేవలను గుర్తించి రైతు నేస్తం-స్వర్ణ భారత్ స్వచంద సంస్థ ద్వారా ఉత్తమ రైతుగా గుర్తించి ప్రశంసా పత్రాన్ని ఆదివారం హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా స్వీకరించారు.