కరీంనగర్ లో ఓపెన్ జిమ్ ప్రారంభం
21-05-2026 10:54 AM
ముకరంపుర, మే 21(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ "ఫిట్ ఇండియా" నినాదం స్ఫూర్తిగా , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో, మలయప్ప ఫౌండేషన్ సీఎస్ఆర్ నిధుల ద్వారా నగరంలోని 24వ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను(Open Gym) గురువారం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఈ ఓపెన్ జిమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కరీంనగర్ నగరపాలక సంస్థ 24వ డివిజన్ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి ,22వ డివిజన్ కార్పొరేటర్ బండ రమణారెడ్డి మరియు పాలకవర్గ సభ్యులు, వాకర్స్,డివిజన్ ప్రజలు,మహిళలు పాల్గొన్నారు.






