8 July, 2026 | 8:44 PM

Breaking News

సమస్యలు పరిష్కరించాలని వినతి   •   ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన చావా రామకృష్ణ   •   ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి   •   ఘనంగా అయ్యప్ప స్వామి 11వ వార్షికోత్సవ వేడుకలు   •   పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి   •   ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •  

బీసీ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలని సీఎంకు బహిరంగ లేఖ

29-04-2025 01:02 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగిన బిసి డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిసి హక్కుల పోరాట సమితి నాయకులు బహిరంగ లేఖను మంగళవారం పంపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న హామీలను మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు, ఐదు సంవత్సరాలలో బిసిల సంక్షేమానికి లక్ష కోట్ల బడ్జెట్ కేటాయింపు, అన్నీ జిల్లా కేంద్రాలలో బిసి భవనాల నిర్మాణం, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ప్రభుత్వం బిసి సమాజం ముందు దోషిగా నిలబెడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి హక్కుల పోరాట సంఘం నాయకులు పాల్గొన్నారు.