పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
నిర్మల్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): సొన్ మండలంలోని పలు గ్రామాల్లో అకా ల వర్షాలు, వడగళ్ల వర్షంవల్ల నష్టపోయిన మొక్క జొన్న పంటనుఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. మండలంలోని సొన్, కూచన్ పల్లి, బొప్పారం, న్యూ వెల్మల్ గ్రామాల్లో నేలకొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించారు.
సుమారు ఒక్క సొన్ మండలంలోనే 1000 ఎకరాలపైనే పంట నష్టం వాటిల్లిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతీసారి నివేదికలు తెప్పించుకోవడం తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా నష్ట పరిహారం చెల్లించలేదన్నారు.
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సరికెల గంగన్న, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, న్యూ వెల్మల్ సర్పంచ్ రాచకొండ సాగర్, బొప్పారం సర్పంచ్ నరేష్, రైతులు పాల్గొన్నారు. అలాగే సారంగాపూర్ మామడ మండలంలోని వివిధ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కరిపె రవళి విలాస్, మండల ఉపాధ్యక్షులు వెలిశాలి తిరుమలచారి, మండల బీజేపీ నాయకులు చెన్న రాజేశ్వర్, సాహెబ్ రావ్, ఆడెపు మహేందర్, అల్లాడి నర్సయ్య, మహేందర్,ముత్యంతో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.






