26 August, 2026 | 8:56 PM

21వేల మంది ఉద్యోగుల ఉద్వాసన

24-06-2026 12:25 AM

‘ఒరాకిల్’ సంచలన నిర్ణయం

సంస్థలో ఏఐ వినియోగానికి ప్రాధాన్యం 

టెక్సాస్, జూన్ 23: కృత్రిమ మేధను (ఏఐ) సంస్థలో భాగం చేయడంతో ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వచ్చిందని, భవిష్యత్‌లోనూ ఈ కోతలు కొనసాగుతాయని ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ ఒరాకిల్ తెలిపింది. గత 12 నెలల్లో 21వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు జూన్ 22న విడుదల చేసిన సంస్థ వార్షిక నివేదికలో స్పష్టం చేసింది.

 AI వస్తే ఉద్యోగాలు పోతాయా? Oracle తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ టెక్ రంగంలో పెద్ద చర్చకు దారితీసింది.

లేఆఫ్‌లతో ఉద్యోగుల సంఖ్య 1,41,000కు చేరి 13 శాతం తగ్గింది. ఒక సంవత్సరం క్రితం ఈ సంఖ్య 1,62,000గా ఉండేది. ఇందులో 49వేల మంది అమెరికా ఉద్యోగులుండగా, విదేశాల్లో 92 వేల మంది పనిచేస్తున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి క్లౌడ్, డేటా సెంటర్ల దిగ్గజాలు ఏఐ మోడల్స్ వినియోగంపై ఎక్కువగా మొగు ్గచూపుతున్నాయి.

తాజా టెక్నాలజీ వార్తల కోసం విజయక్రాంతి Latest News సెక్షన్‌ను సందర్శించండి.

ఒరాకిల్ డేటా సెంటర్ల నిర్మాణంలో భాగమై తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నగదు ఆదా, కార్యకలాపాల పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఉద్యోగాలకు కోత పెడుతోంది. ఒరాకిల్ తన విస్తరణకు నిధులు సమకూర్చుకోవడానికి నగదును ఖర్చు చేయడం, రుణాలు జారీ చేయడంపై ఆధారపడింది. ఈ సంస్థ షేర్లు 2026లో 10 శాతం తగ్గి 70 బిలియన్ డాలర్ల నికర మూలధన వ్యయాన్ని అంచనా వేస్తుంది. గతంలో ప్రకటించిన 20 బిలియన్ డాలర్ల స్టాక్ జారీతో సహా, రుణం, ఈక్విటీ రూపంలో 40 బిలియన్లను సమీకరించనుంది.

తెలుసా?

AI వినియోగం పెరుగుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగాల నిర్మాణాన్ని మార్చుకుంటున్నాయి. కొత్త AI నైపుణ్యాలు ఉన్న ఉద్యోగాలకు మాత్రం డిమాండ్ పెరుగుతోంది.

ప్రశ్న: Oracle ఎందుకు 21వేల మంది ఉద్యోగులను తొలగించింది?
సమాధానం: సంస్థలో AI వినియోగాన్ని విస్తరించడం, ఖర్చులను తగ్గించడం, డేటా సెంటర్ విస్తరణ కోసం నిధులను సమకూర్చుకోవడం వంటి కారణాలతో Oracle గత 12 నెలల్లో 21వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు తన వార్షిక నివేదికలో వెల్లడించింది.

ఉద్యోగాలు, విద్య, కెరీర్ అప్‌డేట్స్ కోసం Education News విభాగాన్ని ఫాలో అవ్వండి.

FAQ's

ORACLE ఎందుకు 21వేల మంది ఉద్యోగులను తొలగించింది?
AI వినియోగాన్ని పెంచడం, ఖర్చులను తగ్గించడం, డేటా సెంటర్ విస్తరణ కోసం నిధులను సమకూర్చుకోవడం ప్రధాన కారణాలు.

ORACLEలో మొత్తం ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు?
ప్రస్తుతం Oracleలో సుమారు 1.41 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

AI వల్ల టెక్ ఉద్యోగాలపై ప్రభావం ఉందా?
అవును. పలు టెక్ కంపెనీలు ఆటోమేషన్, AI ఆధారిత విధానాలను అవలంబిస్తూ ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నాయి.

ORACLE భవిష్యత్‌లో కూడా ఉద్యోగాల కోతలు కొనసాగిస్తుందా?
సంస్థ వార్షిక నివేదిక ప్రకారం భవిష్యత్‌లో కూడా లేఆఫ్‌లు కొనసాగే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది.

దేశవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్య పరిణామాల కోసం National News చదవండి.