calender_icon.png 9 January, 2026 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ అరెస్ట్

08-01-2026 12:59:29 AM

28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసు

  1. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అధికారులు
  2. నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా సునీల్
  3. మరో కేసులో ట్రిలియన్ లీడ్స్ ఎండీ చేతన్ అరెస్ట్
  4. నకిలీ ఐటీసీతో రూ. 22 కోట్లు స్వాహాచేసిన వైనం

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 7 (విజయక్రాంతి): పన్ను ఎగవేతదారులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు ఉక్కుపాదం మోపా రు. రాజకీయ పలుకుబడి ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టంచేస్తూ ప్రముఖ ట్రావె ల్స్ సంస్థ ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి సునీల్ కుమార్‌ను బుధవారం అరెస్ట్ చేశారు. 

వినియోగదారుల నుంచి పన్నులు వసూలు చేసి, ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా రూ. 28.24 కోట్లు దారి మళ్లించిన అభియోగంపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుల నుంచి టికెట్లపై జీఎస్టీని వసూలు చేసిన యాజమాన్యం.. ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించలేదు. గడువు ముగి సి మూడునెలలు దాటినా పన్ను కట్టకపోవడంతో అధికారులు నిఘాపెట్టారు. ఈ క్రమంలో దాదాపు రూ. 28.24 కోట్ల మేర పన్ను ఎగవేసిన ట్లు తేలడంతో సునీల్‌కుమార్‌ను అరెస్ట్‌చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. 

నకిలీ ఇన్వాయిస్‌లతో..

ఇదే సమయంలో జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన మరో సంస్థపైనా డీజీజీఐ అధికారులు చర్యలు తీసుకున్నారు. ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ చేతన్‌ను అరెస్ట్ చేశారు. సుమారు రూ. 22 కోట్ల విలువైన నకిలీ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌ను సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేకుండానే నకిలీ బిల్లులతో జీఎస్టీని మోసం చేసినట్లు అధికారులు నిర్ధారించారు.

వ్యవస్థీకృత నేరాలకు పాల్పడు తున్న పన్ను ఎగవేతదారులను గుర్తించేందుకు డీజీజీఐ అధికారులు అత్యాధునిక డాటా అనలిటిక్స్ సాంకేతికతను వినియోగించారు. ఇతర దర్యాప్తు సంస్థలతో సమన్వ యం చేసుకుంటూ.. విశ్వసనీయ సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు.