18 July, 2026 | 12:42 PM

Breaking News

సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

జోరుగా ఇసుక దందా

08-01-2026 01:19 AM
  1. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొత్తపల్లి టు నేరుగా హైదరాబాద్ 
  2. యద్దెచ్చగా టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా పేరుకే అనుమతులు అక్రమంగా తరలింపు 

మిడ్జిల్, జనవరి 7: మండల పరిధిలో లోని కొత్తపల్లి గ్రామ శివారులో గల దుందుభి వాకి నుంచి అక్రమంగా హిటాచి టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు ప్రజా పాలన ప్రభుత్వంలో ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తున్నదని ప్రజలు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నా మాట.  దీంతో అక్రమంగా తరలించేందుకు వ్యాపారులు వివిధ మార్గాలను అన్వేషిస్తు ఎలాగైనా తమ వ్యాపారాన్ని మరింత విస్తరించినందుకు ప్రత్యేక అడుగులకు శ్రీకారం చెబుతున్నారని ఆయా గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు అభివృద్ధి పనుల పేరుతో మరికొందరు ఇందిరమ్మ ఇండ్లకంటూ యదేచ్ఛగా తరలిస్తున్నారు. వాహనాలకు వాహనాలకు రక్షణగా బైకులపై పైలెట్లు వెళ్తూ ఎవరు అడ్డుపడకుండా గమ్యం చేరుస్తారు. ఎవరైనా అడ్డొస్తే అధికార పార్టీ నాయకులకు సమాచారం చేరవేస్తారు. వారు ఎంట్రీ ఇచ్చి అధికార పార్టీ పలుకుబడితో కత ముగిస్తారు. ఇలా వ్యాపారం సాగుతుండటంతో నిత్యం మూడు పూలు ఆరు కాయలుగా విరజిల్లుతున్నది.

అయినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. టిప్పర్ల ద్వారా ఇసుక వ్యాపారం జోరందుకున్నది పగలు రాత్రి తేడా లేకుండా యదెచ్చగా తరలిస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గం లోని ఇందిరమ్మ ఇండ్లకంటూ యదేచ్ఛగా తరలిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదుల సంఖ్యలో టిప్పర్లు అనుమతుల ముసుగేసుకుని 24/7 అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.

ఇకనైనా అధికారులు స్పందించి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. మిడ్జిల్ తాసిల్దార్ ఇటీవల అనారోగ్య కారణముతో సెలవులో ఉండడంతో జడ్చర్ల తాసిల్దార్ బాధ్యతలు అప్పగించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

కాగా రెండు మండలాలు ఒకే తాసిల్దార్ చూడడంతో పర్యవేక్షణ కూడా కొరవడిందని దీంతోనే ఇష్టం సారంగా అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతుందని ప్రజలు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. నియమ నిబంధనలను అమలు చేస్తూ ముందుకు సాగితే భవిష్యత్తు తరాలకు మేలు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయని జనం ప్రత్యేకంగా చెబుతున్న మాట.