17 March, 2026 | 3:51 AM

ఆదేశాలు బే ఖాతర్!

17-03-2026 01:37 AM
  1. అధికారుల మాటలను ఖాతర్ చేయని కల్లు మూస్తే దారులు
  2. నేల నేల మామూల్లు  దండుకుంటున్న ఎక్సైజ్, పోలీస్ సిబ్బంది
  3. చిన్నారులకు కల్లు విక్రయించవద్దని ఏ ఎస్ పి ఆదేశాలు 
  4. లెక్కచేయని కల్లు ముస్తే దారులు కల్లు మూస్తే దారులకుఎక్సైజ్, పోలీసుల అధికారుల సహకారం 
  5. కల్తీ కల్లు తాగి ఇద్దరు చిన్నారుల మృతి ఘటనతోనైన. అధికారులు మేలు కొంటారా... లేదో..
  6. కల్తీ కల్లు తాగి మృతి చెందుతే కఠిన చర్యలే అంటున్న ఎక్సైజ్, పోలీసులు ఉన్నతాధికారులు
  7. కామారెడ్డిలో ఇటీవల ఇద్దరు చిన్నారుల మృతి కి కల్తీకల్లు సేవించడమే కారణమని ఆరోపణలు
  8. ఫిర్యాదులు రాలేదంటున్న ఎక్సైజ్ సూపర్డెంట్ హనుమంతరావు

కామారెడ్డి, మార్చి 16 (విజయక్రాంతి): కల్తీ కల్లు  సేవించి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నవారు కొందరైతే మరికొందరు మృత్యు వాత పడుతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు కల్తీ కల్లు సేవించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులు  కళ్ళు మూస్తే దారులకు కట్టిన శిక్షలు విధించాల్సింది పోయి మామూళ్లకు కక్కుర్తి పడి మిన్న కుండి పోతున్నారు.

అవగాహన సదస్సులో మాత్రం ఎక్సైజ్ అధికారులు ఒకవైపు పోలీసు అధికారులు మరోవైపు కల్తీ కల్లు విక్రయాలు చేపడుతే కఠినంగా శిక్షిస్తామని అవగాహన సదస్సులో పదేపదే చెప్పడం తప్ప ఆచరణలో మాత్రం పాటించడం లేదు. ఈనెల 6న కామారెడ్డి జిల్లా కేంద్రంలో అదృశ్యమైన గోసంగి కాలనికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతికి కారణము కల్తీకలు సేవించ దం వల్లనే మృతి చెందారని బాధిత కుటుంబ సభ్యుల, స్థానికులు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా పోస్టుమార్టం రిపోర్టులో కూడా కల్తీకల్లు తాగిన ఆనవాళ్లు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. వీటన్నిటినీ కప్పిపుచ్చేందుకు ఎక్సైజ్, పోలీస్ అధికారులు అందరూ  కల్లు మూస్తే దారులతో కుమ్మక్కై తమకేమీ తెలియదని దాటేసి చేతులు దులుపుకుంటున్నారు. కల్తీ కళ్ళు దుకాణాలలో విక్రయాలపై ప్రతినెల శాంపిల్స్ సేకరిస్తున్న ఎక్సైజ్ అధికారులు తూతూ మంత్రంగా కల్తీ క ల్లు శాంపిల్స్ సేకరణ చేపడుతున్నారు. అంతా కూడా కళ్ళు మూస్తే దారుల కనుసనల్లోనే తనిఖీల పర్వం కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. 

తనిఖీలు చేపట్టి  చేతులు దులుపుకుంటున్న ఎక్సైజ్ అధికారులు 

కల్తీ కళ్ళు ప్రాణాల ను హారిస్తున్న ముస్తేదారుల మామూళ్లకు అలవాటు పడిన ఎక్సైజ్, పోలీసులు కొందరు వస్తే దారులకు కొమ్ము కాస్తున్నారు. దీంతో కల్తీ కల్లు అమ్మకాలు జోరుగా జరుపుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు జోరుగా విక్రయిస్తున్నారు. శాంపిల్స్ సేకరణలో మాత్రం కల్తీ లేని నీరు కలిపిన రెండు బాటిళ్లలో కళ్ళు కలిపి ఎక్సైజ్ పోలీసులకు తనిఖీలప్పుడు అప్పగిస్తున్నారు.

దీంతో ల్యాబ్ కు పంపిన లాభం లేకుండా పోతుంది. ఎంతోమంది పేద ప్రజలు పిల్లలు సైతం కల్తీకల్లుకు ప్రాణాలు కోల్పోతున్నారు. అరికట్టాల్సిన అధికారులే మామూళ్ల కు కలవాటు పడి ముస్తేదాలకు ప్రోత్సహిస్తుండడంతో మూడు పువ్వులు ఆరు కాయలు అనే సామెత లాగా కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

కల్తీ కల్లు విక్రయాలు జోరు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కల్తీకల్లు సేవించేందుకు చిన్నపిల్లలు మొదలుకొని యువకులు, వృద్ధులు, సైతం కల్తీ కల్లు తాగి కొందరు దుకాణాల వద్ద అక్కడే నిద్రపోతున్నారు. కల్తీ కల్లు తాగి కళ్ళను వెలేస్తున్నారు. అన్ కాన్సెస్ లోకి వెళ్తున్నారు. కల్తీ కళ్ళుకు అలవాటు పడ్డ వారు కల్తీ కల్లు  లేకుంటే పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు కల్తీకల్లును సేవించిన పట్టించుకోవడం లేదు.

ప్రాణాలు పోతాయని తెలిసిన కల్తీ కల్లు కు బానిసలుగా మారుతున్నారు. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు కల్తీ కల్లు అమ్మకాలను అరికట్టాల్సిన ఎక్సైజ్, పోలీస్  అధికారులు మామూళ్ల మత్తుకు అలవాటు పడి కల్తీ కల్లు విక్రయాలకు అడ్డుకట్ట వేయలేక మరిచిపోతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇటీవల కామారెడ్డి పట్టణంలో ఐదుగురు చిన్నారుల మృతి ఘటన లకు మద్యం సేవించిన తండ్రి తన ముగ్గురు పిల్లలను చెరువులో పడేసి హత్య చేసి కసాయి గా మారిన ఉదాంతం మరవకముందే గోసంగి కాలనీకి చెందిన ఇద్దరు బావబామ్మర్దులు మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమయ్యారు.

తొమ్మిది రోజులకు ఇద్దరు చిన్నారుల అదృశ్యం కేసు మిస్టరీ బయటకు వచ్చిన పిల్లలు ఇద్దరు కల్తీ కల్లు తాగి గుంత వరకు వెళ్లినట్లు సీసీ కెమెరాలు సైతం బయట పెట్టిన అధికారులు మాత్రం చర్యలకు వెనుకడుగు వేస్తున్నారంటే మామూళ్లకు అలవాటు పడి కక్కుర్తి పడుతున్నారనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏమి ఉండదని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులను వివరణ కోరితే తమకు ఫిర్యాదు రాలేదని జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ హనుమంతరావు చెప్పడం చూస్తుంటే ఎంత నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలకు పూనుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

కల్తీ కల్లు కుటుంబాలలో చిచ్చు

చిన్నారుల ప్రాణాలే కాకుండా యుక్త వయసు కలిగిన వారు సైతం కల్తీకల్లుకు బానిసలుగా మారి కుటుంబాలలో చిచ్చు పెడుతున్నారు. భార్యాభర్తల మధ్య తల్లిదండ్రుల మధ్య గొడవలు కు కారణాలు అవుతున్నారు. కల్లు మూస్తే దారులు మాత్రం అధికారుల మాటలను  పేడచెవిన  పెడుతున్నారు. 

 కల్తీ కల్లు విక్రయాలు బహిరంగ రహస్యమే.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కల్లు ముస్తేదారులు కల్తీకల్లు విక్రయాలు చేపట్టడం బహిరంగ రహస్యమే నని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. కల్తీ కల్లు విక్రయాలు చేపడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కామారెడ్డి గోసంగి కాలానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతికి కల్తీ కల్లు సేవించడమే నని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. కల్తీ కల్లు బీడీ వర్కర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన దుకాణాల లో కొన్నిటికి లైసెన్సులు కూడా తీసుకోకుండానే కల్తీ కల్లు విక్రయాలు చేపడుతున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎక్సైజ్ అధికారులను వివరణ కోరగా దాటావేసే ధోరణిని అవలంబించారు.

అసలు లైసెన్సులు లేకుండానే కొన్ని కల్లుదుకాణాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బహిరంగంగా విక్రయించడం చూస్తుంటే ఎక్సైజ్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు సైతం మామూళ్ల మత్తుకు  తల్లోగు తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏఎస్పీ చైతన్య రెడ్డి సైతం గత ఏడాది కామారెడ్డి జిల్లాలోని కల్లు మూస్తే దారులతో సమావేశము ఏర్పాటు చేసి 18 సంవత్సరాల లోపు పిల్లలకు కళ్ళు విక్రయించవద్దని దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసిన కల్లుమూస్తే దారులు మొక్కుబడిగా ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. సీసీ కెమెరాల నిర్వహణను గాలికి వదిలేశారు.

కల్లు దుకాణాలలో పనిచేయని సీసీ కెమెరాలు 

జిల్లా కేంద్రంలో గత ఏడాది క్రితం సీసీ కెమెరాలు దుకాణాలలో ఏర్పాటుచేసిన ప్రస్తుతం కల్లు ముస్తేదారులు వాటి పర్యవేక్షణ చూడడం లేదు. నామ్ కే వస్తేగా సీసీ కెమెరాలు ఉన్నాయా అంటే ఉన్నాయి కానీ సీసీ కెమెరాలు పనిచేయకుండా దర్శనమిస్తున్నాయి.

ఏసీపి ఆదేశాలను బుట్ట దాఖలు 

18 సంవత్సరాల లోపు చిన్నారులకు కల్లు విక్రయించవద్దని, విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే దుకాణాలను సీజ్ చేయడమే కాకుండా నిర్వాకులపై కఠిన చర్యలు తీసుకోవడం కేసులు నమోదు చేస్తామని ఏఎస్పీ చైతన్య రెడ్డి గత ఏడాది క్రితం ముస్సేదారులతో సమావేశం నిర్వహించి కఠినంగా హెచ్చరించారు. ఏ ఎస్ పి ఆదేశాలను క ల్లు మూస్తే దారులు బుట్ట దాఖలు చేస్తున్నారు. 

చిన్నారులకు సైతం కల్తీ కల్లు విక్రయాలు

 చిన్నారులకు సైతం కల్తీ క ల్లు విక్రయిస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులు మేలుకొంటారో  లేదో వేచి చూడాల్సిందే. 18 సంవత్సరాల లోపు చిన్నారులకు కల్తీ కల్లు విక్రయించడం వల్లే ఇటీవల గోసంగి కాలనీకి చెందిన ఇద్దరు 10 సంవత్సరాలలోపు చిన్నారులు చెరువు గుంతలో పాడుబడిన బావిలో పడి మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.