12-08-2025 12:17:17 AM
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, ఆగస్టు 11 (విజయక్రాంతి) : మహిళల ఆర్థిక అభివృద్ధికి స్వయం సంఘా లు కృషి చేస్తాయని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో సామాజిక చేకూర్పు- నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పా టు విభిన్న ప్రతిభవంతుల (పిడబ్ల్యుడి) సం ఘాలు, కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు శిక్షణ కార్యక్రమమును సోమవారం కళాభవనులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అశిష్ సాంగ్వా న్ పాల్గొన్నారు.
శిక్షణ కార్యక్రమంలో హాజరైన 22 మండలాల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, గ్రామ సంఘాల క్లస్టర్ కో-ఆర్డినేటర్లను, మండల సమాఖ్య ప్రతినిధులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మిగిలిపోయిన సంఘాలలో చేరినటువంటి నాలుగు రకాలు మొదటిగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు సంఘాల్లో చేరకుండా మిగిలిపోయిన పేద మహిళలను అందరిని సంఘాలలో చేర్పించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడి ) చందర్ నాయక్, గ్రామీణ పేదరిక నిర్మూలన డిఆర్డిఓ సురేందర్, అడిషనల్ డిఆర్డిఓ విజయలక్ష్మి, డీపీఎం, శ్రీనివాస్, నాన్ ఫాం డిపిఎం సాయిలు, ఫాం డిపీఎం సురేష్, సోషల్ సెక్యూరిటీ డిపిఎం శోభ, ఫైనాన్స్ డిపిఎం రాజయ్య, అధికారులు పాల్గొన్నారు.
ఆల్బండజోల్ మాత్రలు వేసిన కలెక్టర్..
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమ వారం ప్రారంభించారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు ఆల్బండజోల్ మాత్ర లు వేసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నులిపురుగుల నివారణకు 1 నుండి 19 సంవత్సరాలలోపు ప్రతి ఒక్కరు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు.
నులిపురుగుల వల్ల సంభవించు రక్తహీనత, ఆకలి లేమి, మానసిక ఆరోగ్యపరంగా ఎదుగుదల వంటి వ్యాధుల నుండి దూరంగా ఉండి విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించా రు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం నులిపురుగుల నివారణ దినోత్సవం 2025 సంవత్సరానికి జిల్లాలో అన్ని పాఠశాలలో, అంగన్వాడీలలో, ఇంటర్మీడియట్ కళాశాలలో 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలను వేశారు. డాక్టర్ పి చంద్రశేఖర్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, రాజు, డీఈ ఓ ప్రభు కిరణ్, డిప్యూటీ డిఎంహెఓ డాక్టర్, విద్యార్థులు పాల్గొన్నారు.