calender_icon.png 12 August, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నాయకుల జోలికొస్తే గుడ్డలూడదీసి కొడతాం

12-08-2025 12:17:22 AM

చక్రధర్ గౌడ్ ఆరోపణలపై మండిపడిన కాంగ్రెస్ నాయకులు

సిద్దిపేట, ఆగస్టు 11 (విజయక్రాంతి) : చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే గుడ్డలు ఊడదీసి కొడతామని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్ అన్నారు. చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి విమర్శలు చేయడం ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తిగా తెలుస్తుందన్నారు. సోమవారం సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎక్కడ ఎలాంటి కార్యక్రమం చేశాడో ప్రజలకు తెలుసునని, పలుకుబడి ఉన్న పెద్ద నాయకులను విమర్శిస్తే గుర్తింపు లభిస్తుందని చక్రధర గౌడ్ బ్రమ పడుతున్నాడని మండిపడ్డారు. అనాలోచిత మాటలు, అజ్ఞాన పనులు మానుకోవాలని హెచ్చరించారు. సుమారు పదివేల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అక్రమంగా డబ్బు సొమ్ము చేసుకున్న చక్రధర్ గౌడ్ నీతి, నిజాయితీ కోసం మాట్లాడం సిగ్గుచేటన్నారు.

చక్రధర్ గౌడ్ పై ఉన్న కేసులకు సంబంధించిన ఆధారాలను ప్రెస్ మీట్ లో చూపించారు.   మైనంపల్లి హనుమంతరావు, పూజల హరికృష్ణ లను మరోసారి విమర్శిస్తే సిద్దిపేటలో తిరగనియ్యమంటూ మండిపడ్డారు. చక్రధర్ గౌడ్ పార్టీ మారడం పీడ విరగడైందని సంతోషం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ కార్యకర్తలను రౌడీలు, గుండాలంటూ సంబోధించిన చక్రధర్ గౌడ్ మరోసారి ఆ పదాలు వాడితే తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మల యాదగిరి, గంప మహేందర్, గయాసుద్దీన్, ఖలీముద్దీన్, ఆనంద్, మహేందర్, ముద్దం లక్ష్మి, మార్క సతీష్ గౌడ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.