15 May, 2026 | 2:53 AM

వాక్ ఫర్ వాటర్ పాదయాత్ర

15-05-2026 01:18 AM

రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టనున్న వాక్ ఫర్ వాటర్ పాదయాత్ర కార్య క్రమాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై గురువారం రావు కోళ్ల నాగరాజు అధ్యతన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అనేక కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దా ల్చిన నేపథ్యంలో ఆయా కాలనీ అసోసియేషన్లతో సమన్వయం పెంచి నీటి సమస్యపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించారు. నీటి ఎద్దడి సమస్య కేవలం తాత్కాలిక చర్యలతో కాకుండా, దీర్ఘకాలిక మరియు శాశ్వత పరిష్కారంతో మాత్రమే నివారించవచ్చని నాయకులు అభిప్రాయపడ్డారు.

ప్రజలకు నీటి సమస్య తీవ్రతను తెలియజేస్తూ, వారి మద్దతు కూడగట్టేందుకు వాక్ ఫర్ వాటర్ పాదయాత్రను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని సమావేశంలో పిలుపు నిచ్చారు. పాదయాత్రలో పాల్గొనే కార్యకర్తలు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ పాటించేలా వివిధ విభాగాలకు బాధ్యతలు కేటాయించాలని నిర్ణయించారు.

కిస్మత్పూర్ డివిజన్ నుంచి బండ్లగూడ డివిజన్ మీదు గా హైదర్శకోట్ డివిజన్ పరమేష్ కేఫ్ చౌర స్తా వరకు నిర్వహించనున్న వాక్ ఫర్ వాటర్ పాదయాత్ర రాజేంద్రనగర్ సర్కిల్  ప్రజల నీటి హక్కుల సాధనకు ఒక కీలక అడుగుగా నిలవాలని, ప్రతి కార్యకర్త అహర్నిశలు కృషి చేసి కార్యక్రమాన్ని ఘనవిజయం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.