కల్లూరులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
కల్లూరు, మే 14(విజయక్రాంతి): దేవాలయాలలో దొంగతనాలు చేసే అంతర్ రాష్ట్ర దొంగల ముఠా ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించ్చినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. గురువారం కల్లూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. బుధవారం సాయంత్రం కల్లూరు ఎస్త్స్ర హరిత తన సిబ్బందితో కల్లూరు శివారులో గల మధిర రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన బోలుసు ఏసుబాబు అలియాస్ మానికల ఏసుబాబు, చేవూరి ఆదినారాయణ, వేంసూరు మండలం కు చెందిన తుమ్మల మురళి ముగ్గురు నిందుతులు రెండు ద్విచక్ర వాహనాలపై వస్తూ కల్లూరు పోలీసు వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించుండగా, వారిని వెంబడించి పట్టుకున్నారని తెలిపారు.
వారి యొక్క వెలి ముద్రలను ఎంఎస్ డీసీ లో డివైస్ లో చెక్ చేయగా, వారిలో ఇద్దరి వేలి ముద్రలు డేటా బేస్ లో మ్యాచ్ అయ్యాయని పేర్కొన్నారు. పోలీస్ డేటా బేస్ ప్రకారం ఇద్దరు గతంలో పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చారని తెలిసిందని, వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితులు రాత్రిపూట మోటార్ సైకిళ్ళ పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు మండలాల లో తిరుగుతూ దేవాలయాలను రెక్కీ చేసి ఎవరూ లేని సమయంలో వెళ్లి ఆ దేవాలయములోని హుండీలను పగులగొట్టి అందులోని డబ్బులను ఎత్తుకుపోవడం అలాగే దారి వెంట ఉన్న కిరాణా షాపులను పగలగొట్టి అందులోని సరుకులు,డబ్బులను దొంగలిస్తామని ఒప్పుకున్నారన్నారు.
గత ఆరు నెలలుగా వీరు కల్లూరు మండలం చెన్నూరు, చిన్న కోరుకొండి, తల్లాడ మండలం లోని వెంకటగిరి, మధిర మండలం లోని మల్లారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విస్సనపేట, ఆంజనేయస్వామి దేవాలయాలలో హుండీలను పగులగొట్టి అందులోని సొత్తు ను, అలాగే చెన్నూరు లోని ఒక కిరాణాషాపు లో దొంగతనం, పెనుబల్లి లోని పోస్ట్ ఆఫీస్ లో దొంగతనం చేశారు. నిందుతుల నుండి దొంగతనం చేయడానికి ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్ళు, గడ్డపారను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. చోరి కేసుల్లో నిందుతులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన డి హరిత ఎస్త్స్ర కల్లూరు, హెడ్ కానిస్టేబుల్లు నాగేంద్ర బాబు, సత్యనారాయణ, నరసింహారావు, కల్లూరు పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.






