అప్రమత్తంగా ఉండండి..
రాకపోకలపై నిఘా ఉంచండి..
పోలీస్ అధికారులను ఆదేశించిన ఓఎస్డి..
ములకలపల్లి (విజయక్రాంతి): అప్రమత్తంగా ఉండండి... రాకపోకలపై నిఘా పెంచండి... అనుమానితులు ఎవరైనా కనిపిస్తే అదుపులోకి తీసుకోండి అంటూ కొత్తగూడెం ఓఎస్డి నరేందర్(OSD Narender) పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం ములకలపల్లి పోలీస్ స్టేషన్(Mulakalapalli Police Station)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి, సిబ్బంది యోగక్షేమాలు తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని చలమన్న నగర్ ను సందర్శించి గుత్తి కోయాలతో మాట్లాడారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం అందివ్వాలని సూచించారు. గ్రామంలోని చిన్నారులకు పలకలు గొడుగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్, ములకలపల్లి పోలీసులు, మాజీ సర్పంచ్ సుధీర్ పాల్గొన్నారు.




