calender_icon.png 8 July, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛీ.. ఛీ.. అవినీతి గబ్బు!

03-07-2025 12:00:00 AM

  1. కలెక్టర్ సార్ అధికారులపై నజర్ వేయండి...
  2. వరుసగా  ఏసీబీకి ట్రాప్ అవుతున్న అవినీతి ఆఫీసర్లు 
  3. పట్టుబడుతున్నా పద్ధతి మారడం లేదు 
  4. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్
  5. ఏళ్లకు ఏళ్లుగా ఆఫీసులోనే అవినీతి జలగల తీష్ట 
  6. ఛీదరించుకుంటున్న అంటున్న జిల్లా ప్రజలు
  7. తహసీల్దార్ నాగార్జున ఏసీబీకి పట్టుబడంతో  కార్యాలయం ఆవరణలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్న రైతులు 

రంగారెడ్డి,జూలై 2:(విజయ క్రాంతి): అందులేదు ఇందు వలదు అని కాదు.. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది.. కరెన్సీ కట్టలు గుట్టలు గుట్టలుగా చే తులు మారుతున్నాయి.. సామాన్యుల నుం చి సంపన్నుల దాకా అవినీతి జలగలు పట్టిపీడిస్తున్నాయి.. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో మాముళ్లు ఇవ్వనిదే ఫైల్స్ కదలడం లేదు.. దొరికితే చాలు అనకొండల మాదిరిగా మిం గేస్తున్నారు..

రంగారెడ్డి జిల్లాలో అధికారుల అవినీతి కంపు కొడుతుంది. వరుసగా ఏసీబీ అధికారులకు ట్రాప్ అవుతున్న  పద్ధతి మార్చుకోవడం లేదు. అవినీతి రహితంగా పాలన అందించాలని... ప్రజలకు జవాబుదారీతనంగా  ఉండాలంటూ    ఉన్నతాధికా రుల ఆదేశించిన వారిలో మార్పు కనబడటం లేదు. ప్రధానంగా రెవెన్యూ, రిజి స్ట్రేషన్,ఎక్సైజ్, విద్యుత్, మైనింగ్, ఇరిగేషన్ శాఖలో ఏళ్లకు ఏళ్లుగా ఆయా శాఖల అధికారులు తీష్ట వేస్తున్నారు.

జిల్లాలో ప్రధానంగా ఆదాయ వనరులు సమకూర్చే శాఖలోని అవినీతి తతంగం కొనసాగుతుండడం విశే షం. నిబంధనల ప్రకారం ఒక శాఖలో ఫైలు కదలాల్సి ఉన్న...ఏ ఆర్జీ పైన సంతకం పెట్టాలన్న...రెవెన్యూ రికార్డులో భూమి వివరాలు నమోదు చేయాలన్న గుత్త దారుల బిల్లులు క్లియరెన్స్ చేయాలన్న సంక్షేమ పథకాల ఫై లు మూవ్ కావాలన్నా ఈ అవినీతి అధికారుల చేతి తడవాల్సిందేనని ఆరోపణలు విని పిస్తున్నాయి.

తాజాగా తలకొండపల్లి మండలంలో తాసిల్దార్ నాగార్జున అటెండర్ యా దగిరి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అంతారం గ్రామానికి చెందిన రైతు మల్ల య్య  తన పూర్వీకుల నుంచి వచ్చిన 22 గం టల భూమిని తన సోదరుల పేరుపై మా ర్పిడి చేసేందుకు తాసిల్దార్ ను ఆశ్రయించా రు. దీనికి తాసిల్దారు డబ్బులు డిమాండ్ చేయగా  రైతు మల్లయ్య అటెండర్ కు పది వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డిఎస్పి ఆనంద్ తాసిల్దారు నాగార్జున అటెండర్ యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు.

ఏ వన్ గా తాసిల్దార్ నాగార్జున ఎటుగా అటెండర్ యాదగిరి పై కేసు నమోదు చేశారు. గత నెల లో ఇబ్రహీంపట్నం రెవిన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ ఏడుగుంటల భూమిని రికార్డులో చేర్చేందుకు బాధిత రైతులు నుంచి 12 లక్షల ను డిమాండ్ చేస్తూ అడ్డంగా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. దీంతో జిల్లాలో ఏసీబీ రైడ్స్ అన్ని శాఖల్లో కలకలం రేపింది.

 రంగారెడ్డి పైనే అందరి కళ్ళు

జిల్లాలో వరుసగా ఏసీబీ అధికారులు ప ట్టుబడి ఊసలు లెక్కబెడుతున్న ఆయా శా ఖల అధికారులు మార్పు రాకపోవడం విడ్డూరం. ఒకపక్క దర్జాగా లంచం పుచ్చుకుంటూనే మేము ఒకరమే తింటామా అం టూ నీతి వ్యాఖ్యలు వల్లబోస్తూ పైన ఉన్నత అధికారులు కూడా ఇందులో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందంటూ ఎలాంటి జంకు, బొంకు లేకుండా చెప్తున్నారంటే అవినీతి అధికారులకు ఆయా శాఖలో పై స్థాయి అధికారులు అండదండలు ఎంత పుష్కలంగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఒకవేళ అవినీతి అధికారులు మాటకు నో చెబితే చా లు ఎక్కడి ఫైల్ అక్కడే ఆగిపోతుంది. నిబంధనల కోర్రిలా పేరు చెబుతూ బాధితులను ఆఫీసులో చుట్టూ తిప్పించుకుంటూ ముప్పు తిప్పలు పెడుతున్న ఘటనలు జిల్లాలో కోకొ ల్ల లుగా చెప్పుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా పేరు చెప్తేనే రాష్ట్రంలో మంచి ఆదాయం ఉ న్న జిల్లాగా బంగారు బాతు గా అందరూ అభివర్ణిస్తారు.అందుకే రంగా రెడ్డి జిల్లాలో ఏశాఖ లో అయి నా సరే ఇక్కడ విధులు నిర్వహించాలనే నిర్వహించాలని  అధికారులు తహ తహ లాడుతుంటారు.

మారు మూల ఉన్న ఆదిలాబాద్  మొదలుకొని... చిట్టచివరిగా ఉన్న జోగులాంబ గద్వాల జిల్లా వరకు అందరి కళ్ళు రంగారెడ్డి జిల్లా పైనే పడతాయి అనడంలో అతిశయోక్తి లే దు. కొంచెం రాజకీయ పలుకుబడి, ఉన్నత స్థాయి అధికారుల అండదండలు, ఆర్థిక స్తోమత ఉంటే చాలు చీటికలో రంగారెడ్డి జి ల్లాకు బదిలీలు కావచ్చు. ఇటీవల జిల్లాలో పలు శాఖల అధికారులు మెజార్టీగా బదిలీలై ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లు ఆ కోవకే చెంది న వారంటూ సైతం విమర్శలు వినిపిస్తున్నా యి.

ఇలా బదిలీపై వచ్చిన అధికారులు ప్ర ధానంగా ఆదాయ వనరులపైనే దృష్టి పెడు తూ అక్రమ వసుళ్ళకు తెరలేపుతున్నారు. ఒకరి తర్వాత మరొకరు ఏసీబీ అధికారుల గాలాలకు చిక్కి విలవిల్లాడుతున్నారు . బాధితుల నుంచి లంచం పుచ్చుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడుతూ ఇంటా బయట పరువు పోగొట్టుకు న్న... డోంట్ కేర్ అంటూ దర్జాగా మళ్లీ శర మామూలుగానే అధికారులు వ్యహారం కొనసాగుతుండడం గమనార్హం.

జిల్లాలో మచ్చుకు కొన్ని ఘటనలను పరిశీలిస్తే

 రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్గా విధు లు నిర్వహిస్తున్న భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి ఏసిబికి ట్రాప్ కావడం రాష్ట్ర స్థాయిలో సంచలంగా మారిం ది. అప్పుడు రెవెన్యూ వర్గాల్లో అధికారులకు ఝలక్ పుట్టింది. గుర్రంగూడ  కు చెందిన ఒక రైతు 14 గుంటల భూమి రికార్డులో చేర్చాలని కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నాడు. రికార్డులు   తప్పులో దొర్లయ్యాయి.

నిబంధనల ప్రకారం రైతు పెట్టు కొన్న అర్జీ ని అధికారులు పరిశీలించి రికార్డులు పరిశీలించి అట్టి భూమిని నమోదు చేయాల్సి ఉండే కానీ రియల్ భూముల విలువ పెరగడంతో అధికారుల కళ్ళు పైసల పై పడ్డాయి. కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఉత్త పుణ్యానికి రికార్డులో చేరిస్తే  ఎలా ఎం తో కొంత ఇవ్వాలి కదా అంటూ తన మధ్యవర్తి ద్వారా అడిషనల్ కలెక్టర్ తతంగం  నడి పించాడు.

చివరికి బాధితురు నుంచి రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్హ్యాండేడ్ గా  అడ్డంగా దొరికిపోయాడు. అప్పట్లో కేశంపేట తాసిల్దార్ లావణ్య, అబ్దుల్లాపూర్మెట్ తాసిల్దార్ విజయరెడ్డి, కందుకూర్ తహసీల్దా రుగా విధులు నిర్వహించిన మహేందర్ రెడ్డి ల వ్యవహారం కూడా రాష్ట్రంలో తీవ్ర చర్చానియాశంగా మారింది. ఇలా వరుసగా ఏసీ బీ అధికారులకు రెవెన్యూ పట్టుబడుతూ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెడుతూ జైలు పాలు కావాల్సిన దుస్థితి దాపు రిస్తుంది.

ఇలాంటి ఉదాంతాలు మాచ్చుకు కొన్ని మాత్రమే.. ఏసీబీ అధికారులకు దొరికిపోయిన వారి భాగోతాలు మనకు వెలుగు చూస్తున్నాయి.. కానీ ఆయా శాఖలో గుట్టుచప్పుడు కాకుండా వ్యవరాలు  నడిపించే అధికారుల జాబితా తీస్తే  శాంతాడంత అవుతుంది. వరుసగా జిల్లాలో రెవెన్యూ కార్యా ల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులపై ఆ రోపణలు వస్తున్నాయి.

ముఖ్యంగా రియల్ వ్యాపారం జోరందుకుంటున్న మండలాలు మహేశ్వరం, శంషాబాద్, షాద్ నగర్, కొ త్తూరు, నందిగామ, చేవెళ్ల, మొయినాబాద్, కడ్తల, మాడుగుల, ఆమనగల్, షాద్నగర్, కొత్తూరు మొయినాబాద్, చేవెళ్ల మండలా ల్లో రెవెన్యూ అధికారులపై ప్రజలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. 

కలెక్టర్ సార్ అధికారులపై నజర్ పెట్టండి

 జిల్లాలో ఆయా మండలాల్లో  చాప కింద నీరులా అల్లుకుపోయిన అవినీతి అధికారుల పైన జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సా రించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో రెవెన్యూలో సాగిన అవినీతి వ్యహారం చెక్ పెట్టేందుకు తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన  భూభారతి చట్టంతో అవినీతికి చెక్ పడుతుందని అంతా భావించారు.... కా

నీ క్షేత్రస్థాయిలో  మళ్లీ శరమాములుగానే  భూ సమస్యలను అడ్డుపె ట్టుకొని  రెవెన్యూలో  అవినీతి కొనసాగుతుండడం కోసమెరుపు. ఇలాంటి అవినీతి అధికారుల భరతంపట్టి రంగారెడ్డి జిల్లా పరువు పోకుండా అధికారులను గాడిలో పెట్టాల్సిన ప్రధాన బాధ్యత జిల్లా కలెక్టర్ పైనే ఉంది. చూడాలి మరి జిల్లా కలెక్టర్ సాబ్ ఇప్పటికైనా అవినీతి అధికారుల భరతం పడతాడో వేచిచూడక తప్పదు  మరి.