10 May, 2026 | 1:40 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

వందేళ్లు సేవలు అందించేలా ఉస్మానియా

14-01-2025 01:57 AM
  1. కొత్త డిజైన్లను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి
  2. నెలాఖరులోగా నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశం

హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): ఈ నెలాఖరు నాటికి ఉస్మానియా కొత్త హాస్పిటల్ నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రభుత్వం అందుకు సంబంధించిన కార్యాచరణ వేగవంతం చేసింది. సోమవారం  సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో ఉస్మానియా కొత్త హాస్పిటల్ పనులకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ పనులు చేపడ్తున్న ఆర్‌అండ్‌బీ శాఖ రూపొందించిన కొత్త హాస్పిటల్ డిజైన్లను ఆయన పరిశీలించారు. ఈనెలాఖరులోగా ఉస్మానియా కొత్త ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పుడు నిర్మించబోయే హాస్పిటల్ వందేళ్ల వరకు ప్రజలకు సేవలు అందించేలా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ నెల 11న ఇదే అంశంపై రివ్యూ చేసిన ముఖ్యమంత్రి ఉస్మానియా కొత్త ఆస్పత్రి భవనాలు, ఇతర నమూనాలకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు. ఆమేరకు సోమవారం సరికొత్త డిజైన్లను పరిశీలించారు.