29 March, 2026 | 4:50 AM

755.28 కోట్ల అంచనాతో.. ఓయూ వార్షిక బడ్జెట్

29-03-2026 02:11 AM

బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఓయూ ఓఎస్డీ ప్రొఫెసర్ జితేంద్రనాయక్

సికింద్రాబాద్, మార్చ్28 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ 2026  ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 755.28 కోట్ల అంచనా వ్యయంతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. ఓయూ అకడమిక్ సెనేట్ హాలులో వార్షిక బడ్జెట్ (2026- ఓయూ ఓఎస్డీ ప్రొఫెసర్ జితేంద్ర నాయక్ ప్రవేపెట్టగా, అన్ని విభాగాల అధికారులు బడ్జెట్ను తీర్మాణంపై మోదం తెలిపారు. మౌలిక సదుపాయాలు, పరిశోధన ,లింగ సమానత్వానికి పెద్దపీట వేశారు.2026 సంవత్సరానికి అంచనా వేసిన మొత్తం రాబడులు రూ.723.02 కోట్లు కాగా, అంచనా వ్యయం రూ.755.28 కోట్లు ఉన్నట్లు తెలిపారు.

ఇందులో జీతాకు రూ.479.54కోట్లు (56.58%),పెన్షన్లు రూ.310 కోట్లు( 36.58%), కాంటిన్జెన్సీస్ రూ.52.48కోట్లు(6.19 శాతం), ఉద్యోగుల లోన్లు రూ.5.50 కోట్లు(0.65 %)మొత్తం ఆర్థిక సంవత్సవానికి గాను రూ.847.52 కోట్లు ఖర్చు కానుంది.అయితే గతేడాది మిగులు బడ్జెట్ రూ.32.26 కోట్ల ఓపెన్ బ్యాలన్స్తో కలుపుకుని రూ.72302 కోట్లు నిధులు సమ కూరుతాయని, మిగతా నిధులను ప్రభుత్వం వర్సటీ అభివృద్ధికి కేటాయిం చిన వేయి కోట్లు, చాకలి ఐలమ్మ వర్సిటీకి కేటాయించిన రూ.500 కోట్ల నిధులను మళ్లించి లోటును భర్తీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

కాగా బడ్జెట్లో విశ్వవిద్యాలయ చరిత్రలో తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా రూ.2 కోట్లు కేటాయిం చారు. ఈ నిధులతో వర్సిటీలో బోధన, బోధనేతర మహిళా ఉద్యోగు ల అభివృద్దిపై ఖర్చు చేయనున్నారు. అలాగే పరిశోధనా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకుగాను వర్సిటీ ఈ సారి ప్రత్యే కం గా బడ్జెట్లో పరిశోధన కార్యక్రమాల కోసం రూ.10 కోట్లు కేటాయించారు.ఈ నిధులను వర్సిటీ అధ్యాపకులు తాము చేపట్టబోయే పరిశోధనలు, ప్రాజెక్టుల, పరిశోధనా అంశా ల అభివృద్దికి ఖర్చు చేస్తారు. అయితే ఒక్కో అధ్యాప కునికి రూ.2 లక్షల నుంచి రూ.4లక్షల వరకు వారు సమర్పించే ప్రాజెక్టు ఆధారంగా కేటాయిస్తారు. 

బడ్జెట్లో చోటు దక్కని కొత్త కోర్సులు..

ప్రతి ఏడాది బడ్జెట్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టే ఆనవాయితీ ఉంది. అయితే ఈ సారి కొత్త కోర్సులకు బడ్జెట్లో అవకాశం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే 2025 విద్యా సంవత్సరానికి గాను బీ.కామ్, బీబీఏ ఫైనా న్స్, బి.ఎస్సీ (ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ క్వాలిటీ) వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. అద నం గా, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లోని ఐదు విభాగాలకు 2028 వరకు ఎన్బీఏ గుర్తింపు లభించింది.

తీర్మాణాలు..

ఉస్మానియా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్, దివంగత ప్రొఫెసర్ ఎం.వి. సౌందర రాజన్ ఫిబ్రవరి 27, 2026న కన్నుమూసిన నేపథ్యంలో, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంతో సమావేశం ప్రారంభమైంది. మూడు దశాబ్దాల పాటు విద్యావేత్తగా, పరిపాలనాధికా రిగా ఆయన అందించిన విశిష్ట సేవలకు నివాళిగా సెనేట్ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది.

అనంతరం ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలపై సమగ్ర నివేదికను సమర్పించారు.ఈ సమావేశం చివరలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ భాగస్వాముల సహకారంతో ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచ స్థాయి ప్రతిష్ఠను కొనసాగిస్తుందని తెలిపారు. సమావేశంలో వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.