మా బోర్డువి పనికిమాలిన నిర్ణయాలు
పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది ఫైర్
లాహోర్, మార్చి 15: బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్‌లో పాక్ జట్టు ఘోర పరాజయాన్నీ ఆ దేశ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహి ద్ అఫ్రిది తమ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆగ్రహం వ్యక్తంచేశాడు. బంగ్లాతో సిరీస్ ఓట మి అనంతరం షాహిద్ అఫ్రిది పీసీబీని ఏకిపారేస్తూ సోషల్ మీడియా వేదికగా వీడి యో పోస్టును షేర్ చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓటమికి పూర్తి బాధ్యత సెలక్షన్ కమిటీదే అన్నాడు.
నాయకుడిగా అం తగా అనుభవం లేని తన అల్లుడు షహీన్ అఫ్రిదికి ఎందుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారో చెప్పాలని డిమాండ్‌చేశాడు. బాబ ర్ ఆజమ్ లాంటి అనుభవమున్న ఆటగాడిని జట్టు నుంచి తప్పించి పెద్ద తప్పిదమే చేశారనీ, కెప్టెన్‌గా అతనికి మంచి రికార్డు ఉందన్నాడు. ఆటగాడిగా జట్టులో చోటు కల్పిస్తే కనీసం సలహాలు ఇచ్చి ఉండేవాడన్నా డు.
అసలు ఏ ఫార్మాట్‌కు ఎవరిని కెప్టెన్ చేయాలన్న విషయం కూడా పీసీబీకి అవగాహన లేకపోవడం సిగ్గుచేటనీ అఫ్రిది తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అనుభవమున్న క్రికెటర్లను పక్కనబెట్టి కేవలం కొన్ని ఫస్మాట్స్‌కు మ్యా చ్‌లు ఆడిన యువ క్రికెటర్లను తీసుకోవడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నాడు. పీసీబీ తీసుకుంటున్న దిక్కుమాలిన నిర్ణయాలే పాక్ క్రికెట్‌ను భ్రష్టు పట్టించాయన్నా డు. టీ20 ప్రపంచకప్‌లోనూ పాకిస్థాన్ జట్టు దారుణ ప్రదర్శన కనబరిచి కనీసం సెమీ స్ చేరడంలో విఫలమైంది.




