09-11-2025 12:25:56 AM
తెలంగాణ కమ్మ సంఘాల సమాఖ్య
ఖైరతాబాద్, నవంబర్ 8(విజయ క్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాం గ్రెస్ అభ్యర్థికి నవీన్ యాదవ్‌కు తమ సం పూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలంగాణ కమ్మ సంఘాల సమాఖ్య తెలిపింది. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో సమైక్య నాయకులు రవిశంకర్, కృష్ణ ప్రసాద్, సుబ్బారావు లు మాట్లాడారు.
రేవంత్ నేతృత్వంలోని కాం గ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి వేస్తున్న బాట లు ప్రజాస్వామ్యత పాలన తదితర అంశాల నేపథ్యంలో కాంగ్రె స్ పార్టీకి అండగా నిలవాలని తమ సం ఘా లు నిర్ణయించినట్లు తెలిపారు. బిఆర్‌ఎస్ నేతలు కమ్మ సామాజిక వర్గం పై చేస్తున్న తప్పుడు ఆరోపణలు తక్షణమే మానుకోవాలని హితవు పలికారు. దివంగత ఎమ్మెల్యే తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అయినప్పటికీ రాష్ట్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి విజ యం సాధిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందన్న.
సంకల్పంతో తాము నవీన్ యాదవ్ గెలుపు కో సం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల్లో నివసిస్తున్న కమ్మ సామాజిక వర్గ ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలను నవీన్‌కు ఓటు వేసి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమం లో సమైఖ్య నాయకులు కృష్ణ ప్రసాద్, శారద, తులసి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.