09-11-2025 12:27:33 AM
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): కపాస్ కిసాన్ యా ప్‌ను అన్నివేళ లా (24 గంటలు) అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సీసీఐ సీఎండీ లలిత్‌కుమార్ గుప్తాకు వ్యవయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఈ మేరకు శనివారం పలు అంశాలపై ఆయన తో మంత్రి ఫోన్‌లో మా ట్లాడారు. జిన్నింగ్ మిల్లర్లు, రైతుల విన్నపం మేరకు, ఎల్1, ఎల్2, ఎల్3 అని మిల్లులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
20శాతం తేమ ఉన్న పత్తి సీసీఐ కొనేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎకరానికి 12 క్విం టాళ్ల పరిమితి వంటి అంశాలపై చర్చించారు. పాత విధానంలో విక్రయించే అవకాశం కల్పించాలని సూచించారు. యాచారం ప్రాంతంలో రైతులు పండించిన పంట కొనుగోలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
సర్వే వివరాలు అందించాలి
ప్రస్తుతం రాష్ర్టంలో 1.5 లక్ష మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ నిల్వ ఉందని తెలిపారు. ఈ నెలలో రెండు లక్షల మెట్రిక్ ట న్నులు, వచ్చే నెలలో మరో రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు జరిగాయన్నారు. ‘యాద్ బ్లూ’ అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొంథా తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టం పై సర్వే వివరాలు వెంటనే అందించాలని మంత్రి ఆదేశించారు.