15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

స్నానానికి వెళ్లి చనిపోయిన వ్యక్తి

22-02-2026 06:02 PM

తూప్రాన్,(విజయక్రాంతి): పొలము పనుల నిమిత్తం అల్లాడి శంకర్ 40 తన భార్య లావణ్య ను వెంటబెట్టుకొని ఈనెల 20న తూప్రాన్ మండలం ఇమాంపూర్ పరిధిలోని తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పొలముకు గుళికల మందు చల్లడం జరిగింది. తర్వాత తన భార్యతో నువ్వు వెళ్ళు నేను స్నానం చేసి వస్తానని చెప్పిన తన భర్త రాత్రి వరకు రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య మరియు కుమారుడు కలిసి పొలం వద్దకు వెళ్లి చూడగా పొలం పై భాగంలో ఉన్న తుమ్మ చెరువు కట్ట పైన తన భర్త బట్టలు ఉండడం గమనించారు.

తిరిగి ఈనెల 21 ఉదయం తన భావ, కుమారుడు కలిసి చెరువు వద్ద పరిశీలించగా చెరువులో తన భర్త బోర్లపడి ఉండడాన్ని చూసి బోరున విలపించింది. తక్షణమే తన బావ మరియు కుమారుడు ఇద్దరు చెరువులోకి దిగి శవాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని శవ పంచనామ నిర్వహించారు. తన భర్త మరణం విషయంలో ఎవరిపైన ఎలాంటి అనుమానం లేదని చెరువు గట్టు వద్ద స్నానం చేసి వస్తానని వెళ్లి చెరువులో ఉన్న తుంగ చుట్టుకొని చనిపోయినట్లు తన భార్య ఫిర్యాదులో పేర్కొంది. ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.