calender_icon.png 9 November, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసీల్దార్‌పై అక్రమార్కుల దాడి!

09-11-2025 12:25:44 AM

  1. ఎమ్మార్వోకు స్వల్ప గాయాలు
  2. విలేకరిపైన, ఇంటిపైన దాడి
  3. సంగారెడ్డి జిల్లాలో ఘటన

అమీన్‌పూర్, నవంబర్ 8: అక్రమ నిర్మాణాలపై విచారణ చేయడానికి వెళ్లిన తహసీ ల్దార్‌పై అక్రమార్కులు దాడి చేసి గాయపర్చిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూ ర్‌లో జరిగింది. అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని జవహర్‌నగర్ కాలనీలోని సర్వేనెం బర్ 630లో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు తహ సీల్దార్ వెంకటేష్ అక్కడికెళ్లి, అక్రమ నిర్మాణాలను ఆపాలని ఆదేశించారు.

అక్కడే ఉన్న గుర్తుతెలియని వ్యక్తులు తహసీల్దార్‌ను చుట్టుముట్టి, అక్కడి నుంచి వెళ్లాలంటూ భయభ్రాంతులకు గురిచేశారు. తోపులాటలో తహసీల్దార్ కిందపడటంతో స్వల్ప గాయా లు అయ్యాయి. ఆ సమయంలో వార్త సేకరిస్తున్న ఓ విలేకరిని అంతు చూస్తామంటూ బెదిరించారు.

అదే రోజు అర్ధరాత్రి దుండగులు కారులో వెళ్లి సదరు విలేకరిపై దాడి చేసి, ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. గా యాలపాలైన విలేకరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పటాన్‌చెరు నియోజకవర్గ జర్నలిస్టు సంఘాలు శనివారం అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐకి ఫిర్యాదు చేశారు. మీడియాపై దాడిని ఖండించారు.