19-01-2026 12:00:00 AM
అభాగ్యుల ఆకలి తీరుస్తున్న కుషాయిగూడ మారుతి మిత్రమండలి
కుషాయిగూడ, జనవరి 18 (విజయ క్రాంతి): అభాగ్యులు పేదలు ఆకలితో అలమటించే పేదల ఆకలి తీర్చడమే మా లక్ష్యం అని మారుతి మిత్ర మండలి అధ్యక్షులు గురుంచి అశోక్ చారి అన్నారు ఆదివారం కుషాయిగూడ నల్ల పోచమ్మ ఆలయం వద్ద వెయ్యి మందికి అన్నదానాన్ని నిర్వహించారు మారుతి మిత్ర మండలి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా ప్రతినెల ప్రతి అమావాస్య నాడు కుషాయిగూడ మారుతి మిత్ర మండలి ఆధ్వర్యంలో 1000 మందికి అన్నదానాన్ని నిర్వహించి తీరుస్తున్నారని పేదల ఆకలిని తీరుస్తున్నారు.
మారుతి మిత్ర మండలి మిత్రబృందం ఒకరికి వేయి రూపాయలు వేసుకొని ప్రతి అమావాస్య ప్రతినెల వచ్చిందంటే అన్నదానాన్ని నిర్వహించి పేదల ఆకలిని తీరుస్తూ ప్రజల హృదయాల్లో అభిమానాన్ని చురగొంటున్నారు. ఎవరి నుండి ఒక రూపాయి ఆశించకుండా మారుతి మిత్ర మండలి సభ్యులే తల ఇంత వేసుకొని అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ అన్నదాన కార్యక్రమానికి కుషాయిగూడ డివిజన్‌లో ఉన్నటువంటి 18 కాలనీల నుం డి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు ఈ అన్నదాన సేవా కార్యక్రమంలో కుషాయిగూడ మారుతి మిత్ర మండలి బృందం ఓరుగంటి హనుమంతు మచ్చ బాబు వేణుగోపాల్ చారి పంజాల శ్రీనివాస్ గౌడ్ కాసుల సురేష్ గౌడ్ అల్లం దుర్గా సతీష్ గుర్రాల మల్లేష్ ములుగు శ్రీకాంత్ రెడ్డి రమేష్ గౌడ్లు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.