19-01-2026 12:00:00 AM
ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం
ష్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వడం శుభపరిణామం: షేక్ సలాఉద్దీన్
హైదరాబాద్ , సిటీబ్యూరో జనవరి 18 (విజయక్రాంతి): గిగ్ మరియు ప్లాట్ఫామ్ కార్మికులు, అలాగే గృహ కార్మికులకు అండగా నిలిచేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ స్వాగతించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ ప్రతిపాదించిన మైక్రో క్రెడిట్ స్కీం.. సూక్ష్మ రుణ పథకం ...కార్మికుల ఆర్థిక కష్టాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలాఉద్దీన్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ పథకం కింద అర్హులైన కార్మికులకు ఏటా రూ. 10,000 వరకు ష్యూరిటీ లేని రుణాలు అందించనుండటంపై ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పథకం 2026 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుందని సలాఉద్దీన్ తెలిపారు.
గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులు తరచూ ఎదుర్కొనే ఆర్థిక అస్థిరతను కేంద్రం గుర్తించడం అభినందనీయమన్నా రు. అర్హులైన ప్రతి కార్మికుడికి ఈ పథకం ఫ లాలు అందేలా అవగాహన కల్పించాలన్నా రు. పథకం సమర్థవంతంగా అమ లు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, సంబంధిత శాఖల కు తమ యూనియన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.