23 August, 2026 | 4:59 PM

మార్స్ లోయలకు మన పేర్లు

13-06-2024 05:01 AM

న్యూఢిల్లీ, జూన్ 12: విశ్వంలో ఏవైనా కొత్త వస్తువులను, గ్రహాలు, ఉపగ్రహాలను, నక్షత్రాలను కనుగొంటే వాటికి పేర్లు పెట్టడం ఆనవాయితీ. ఈ పేర్లలో అత్యధికం అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించినవే అయి ఉంటాయి. కానీ, తాజాగా మనదేశానికి చెందిన మూడు పేర్లు ఆ జాబితాలో చేరాయి. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రిసెర్చ్ ల్యాబోరేటరీ (పీఆర్‌ఎల్) శాస్త్రవేత్తలు ఇటీవల అంగారక గ్రహంపై మూడు కొత్త లో యలను గుర్తించారు. వాటిని గతంలో ఎవ రూ కనుగొనలేదని, మొదటిసారి పీఆర్‌ఎల్ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారని ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ (ఐఏ యూ) కూడా ధృవీకరించింది. ఆ లోయలకు పేర్లు పెట్టే అవకాశం మన శాస్త్రవేత్తలకు దక్కింది.

దీంతో లాల్ క్రేటర్, ముర్సాన్ క్రేట ర్, హిల్సా క్రేటర్ అని వాటికి పేర్లు పెట్టారు. భారత భూభౌతిక శాస్త్రవేత్త, పీఆర్‌ఎల్ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ దేవేంద్ర లాల్ జ్ఞా పకార్థం ఒకదానికి లాల్ క్రేటర్ అని పేరు పె ట్టారు. ముర్సాన్ అనేది ఉత్తరప్రదేశ్‌లోని ఓ పట్టణం కాగా, హిల్సా పట్టణం బీహార్‌లో ఉన్నది. ఈ రెండు పట్టణాల పేర్లు ఆ లోయలకు పెట్టారు. ప్రస్తేత పీఆర్‌ఎల్ డైరెక్టర్ అని ల్ భరద్వాజ్ జన్మస్థలం ముర్సాన్ పట్టణం. ప్రముఖ పీఆర్‌ఎల్ శాస్త్రవేత్త రాజీవ్‌రంజన్ భారతి జన్మస్థలం హిల్సా పట్టణం.