23 August, 2026 | 3:56 PM

కాశీలో కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల

13-06-2024 05:04 AM

జూన్ 18న వారణాసికి ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జూన్ 12: వారణాసి వేదికగా ప్రధా ని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధులు విడుదల చేయనున్నారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గంలో మోదీ పర్య టించనున్నారు. జూన్ 18వ తేదీన వారణాసికి వెళ్లనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు వారణాసిలోని బాబత్‌పూర్ విమా నాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వారణాసి పట్టణానికి చేరుకుంటారు. నేరుగా సేవాపురి అసెంబ్లీ నియోజ కవర్గంలోని మెహదీగంజ్ గ్రామంలో జరగనున్న కిసాన్ సమ్మేళన్ కార్యక్రమానికి ఆయన హాజరు అవుతారు. వేదికపై పలువురు రైతులను ప్రధాని మోదీ సన్మాని స్తారు.

ఇక్కడి నుంచే కాశీలోని 2,67,665 మంది రైతులకు సంబంధించిన కిసాన్ స మ్మాన్ నిధులను విడుదల చేయనున్నారు. వారణాసిలో దాదాపు నాలుగున్నర గంటల పాటు గడపనున్నారు. కిసాన్ నిధులు విడుదల చేసిన తర్వాత కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుని, దశాశ్వమేథ ఘాట్‌లో గంగా హారతిలో పాల్గొంటారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూ డోసారి ప్రధానిగా ప్ర మాణస్వీకారం చేయ డం అందరికీ ఎంతో గర్వకారణం. మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన తొలిసారిగా వారణాసి వస్తున్నారు’ అని బీజేపీ కాశీ విభాగం అధ్యక్షుడు దిలీప్ పటేల్ సంతోషం వ్యక్తం చేశారు. ‘మోదీ గ్యారంటీల గురించి అందరికీ తెలిసిందే. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఏకైనా నమ్మకమైన వ్యక్తి మోదీ. మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన మొట్టమొదటగా రైతులపై దృష్టి సారించారు. వారణా సి నుంచే కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి రూ.20 వేల కోట్లు 17వ విడత కింద విడుదల చేస్తారు’ అని దిలీప్ వివరించారు.