18 April, 2026 | 12:58 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

మహిళా సాధికారతకు మనదైన వేదిక

11-05-2025 12:00 AM

హైదరాబాద్‌లో ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు

కామిడి సతీష్‌రెడ్డి :

ప్రపంచ సుందరి పోటీలను తెలంగాణలో నిర్వహించడం గర్వకారణం. మన విజయాలను సంస్కృతిని ప్రపంచానికి చాటేలా ఉంది. ఈ పోటీ లు కేవలం అందాన్ని, ప్రతిభను చాటుకునేది కాదు, మహిళా సాధికారత, ప్రపంచ ఐక్యత, వైవిధ్యాలకు వేదికగా ఈ నెల 10 నుంచి 31 వరకు జరిగే మిస్ వరల్డ్ పోటీలకు మన హైదరాబాద్ వేదిక అయింది. 120 దేశాల ప్రతినిధులు హాజరయ్యే ఈ కార్యక్రమం 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమవుతున్నట్టు తెలుస్తున్నది.

మిస్ వరల్డ్ పోటీ ఈవెంట్‌లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, గ్రామీణ పర్యాటకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖంగా ప్రమోట్ చేసేందుకు, పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులను ఆకర్షించి, తద్వారా మన గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా వరంగల్, హన్మకొండ, ములుగు, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్ జిల్లాలలోని పర్యా టక ప్రదేశాలుసహా రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కంటెస్టెంట్లు సందర్శించనున్నారు.

మిస్ వరల్డ్ ఈవెంట్‌లో భాగంగా ఈ నెల 12న ఆధ్యాత్మిక టూరిజానికి చిహ్నం గా ఉన్న నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని, బుద్ధిస్టు థీమ్ పార్కును మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించనున్నారు. అలాగే, ఈ నెల 14న చారిత్రక, ఆధ్యాత్మిక నగరం వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, వరంగల్ పోర్టును సందర్శిస్తారు. ఇదే రోజు వరంగల్ జిల్లాలో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కూడా వారు సందర్శిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన పేరిణి నృత్యాన్ని తిలకిస్తారు.

15న మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లు ఆధ్యాత్మిక టూరిజంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు. హ్యాండ్లూమ్ ఎక్స్‌పీరియన్షల్ టూర్‌లో భాగంగా పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీని, ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకిస్తారు. 16న మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రి వృక్షాన్ని సందర్శిస్తారు. 21న శిల్పారామంలో తెలంగాణ కళాకారులతో నిర్వహించే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వర్క్‌షాప్‌కు హాజరవుతారు. స్వయంగా వాటి తయారీలో భాగమై ప్రత్యక్షంగా తయారీ గురించి తెలుసుకుంటారు.

ప్రపంచ సందర్శకులకు కనువిందు

ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ గ్రామీణ పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రచారం దక్కనుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక గాథలు, ఆధునిక అభివృద్ధి, పర్యాటక ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి తెలుపడంతోపాటు తెలంగాణ గ్రామీణ పర్యాటక ప్రదేశాలను ప్రపంచ పటంలో ప్రముఖంగా నిలిపే అవకాశం దీనిద్వారా లభిస్తుంది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సం దర్శించనున్న గ్రామీణ పర్యాటక ప్రదేశాలలో బుద్ధవనం, బౌద్ధ థీమ్ పార్క్ వంటి వి ఉన్నాయి.

హన్మకొండలోని వేయి స్తం భాల గుడి కాకతీయ రాజవంశీయుల శిల్పకళా వైభవానికి నిదర్శనం. రుద్రదేవ మహారాజు 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడి శివుడు, విష్ణువు, సూర్యదేవుడికి అంకితమైంది. ప్రత్యేక త్రికూటాకార నిర్మాణంతో, నక్షత్ర ఆకారపు వేదికపై నిలిచి ఉంది. గర్భగుడి చుట్టూ 1000కి పైగా సున్నితంగా చెక్కిన స్తంభాలు ఉన్నాయి.

ప్రధాన ఆకర్షణ ఏకశిలా నంది విగ్రహం, ఇది శిల్పుల నైపుణ్యాన్ని చాటుతుంది. ఈ దేవాలయం తురుష్కుల దండయాత్రలో కొంతభాగం నాశనమై, 20వ శతాబ్దంలో పునరుద్ధరణ జరిగింది. ప్రాచీన భారతీయ వాస్తుశిల్పాలకు అద్భుత నమూనాగా ఇది నిలుస్తుంది. ప్రతీ సంవత్సరం వేలాది పర్యాటకులు ఈ గుడిని సందర్శిస్తారు. 

అలాగే, కాకతీయ రాజవంశం వారి వాస్తుశిల్ప వైభవానికి అద్భుత నిదర్శనమే వరంగల్ కోట. 13వ శతాబ్దంలో నిర్మితమైన ఈ కోట కాకతీయుల రాజధానిగా, వ్యూహాత్మక స్థానంగా ఉండింది. సుమారు 3 కిలోమీటర్ల ప్రాంతానికిపైగా విస్తరించిన భవ్యమైన ప్రాకారాలు దీని గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. కాకతీయ కళాతోరణం సూక్ష్మశిల్పాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. స్వయంభూ దేవాలయంలోని శివ లింగం భక్తులకు పవిత్ర తీర్థ స్థలం. కోటలోని ధాన్యాగారాలు, సరుకు గిడ్డంగులు ఆ కాలపు స్థితిని తెలియజేస్తాయి. తెలంగాణ సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ఈ కోట ఒక సజీవ ముద్ర. 

అటు చరిత్ర, ఇటు సంస్కృతి

ములుగు జిల్లా పాలంపేట వద్దగల రామప్ప గుడి, కాకతీయ సామ్రాజ్యం వారి వాస్తుశిల్ప సంపదకు ప్రతీక. ఇది 13వ శతాబ్దంలో గణపతిదేవ మహారాజు పాలనలో నిర్మితమైంది. ఈ శివాలయం ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగానే ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శిల్పాలు, సుందర నృత్యముద్రలు, పురాణ కథలను చిత్రించే శిల్పకృతులు అద్భుతంగా ఉంటాయి.

ప్రత్యేకత ఏమిటంటే, గర్భగుడి పైకప్పు తేలికైన ఇటుకలతో నిర్మితమై, శబ్ద ప్రతిధ్వనిని మార్చే సామర్థ్యం కలిగి ఉంది. ఈ గుడి భూకంప-నిరోధక నిర్మాణ శైలికి ప్రసిద్ధి. 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన ఈ దేవాల యం చుట్టూ సహజ సుందరమైన చెరు వు, హరిత వనాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వచ్చే పర్యాటకులు ఇక్కడ అలరారు తున్న కాకతీయుల ఒకనాటి కళా వైభవాన్ని తప్పక ప్రశంసిస్తారు.

పోచంపల్లి (పుట్టపాక) ప్రాంతంలో నేతన్న మేధస్సుతో తయారయ్యే పోచంపల్లి ఇక్కత్ చీరలు ప్రపంచ ప్రసిద్ధి చెందా యి. 200 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ నేతకళలో నూలు లేదా పట్టుదారాలను డైలో ముందుగా రంగులు వేసి, సంక్లిష్టమైన జ్యామితీయ నమూనాలతో నేస్తారు. ఇక్కత్ టెక్నిక్‌లో రంగులు వేసిన దారాలు సరిగ్గా మ్యాచ్ అయ్యేలా నేత కళాకారులు అద్భు త నైపుణ్యం ప్రదర్శిస్తారు. ప్రతి చీర తయారీకి 10-20 రోజుల వరకు సమయం పడుతుంది.

2005లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన ఈ చీరలు యునెస్కో సిటీ ఆఫ్ క్రాఫ్ట్‌గా గుర్తింపు పొం దాయి. సాంప్రదాయ రంగులతోపాటు ఆధునిక డిజైన్లతో కూడిన పోచంపల్లి చీరలు భారతదేశం సహా విదేశీ మార్కెట్లలోనూ డిమాండ్‌ను కలిగివున్నాయి. సహ జ రంగులను ఉపయోగించడం వల్ల ఎకో ఫ్రెండ్లీగా ఉండటం వీటి ప్రత్యేకత. ప్రపంచ వేదికపై తెలంగాణ సాంస్కృతిక గర్వాన్ని ప్రతిబింబిస్తాయి ఈ చీరలు.

పిల్లలమర్రి అద్భుతం, యాదాద్రి వైభవం

మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రి వృక్షం ఒక అద్వితీయ ప్రకృతి సం భ్రమం. ఫికస్ బెంగాలెన్సిస్ జాతికి చెంది న ఈ ప్రాచీన వృక్షం సుమారు 700 ఏళ్లకుపైగా చరిత్ర కలిగి ఉంది. సుమారు 3 ఎకరాలకు పైగా ప్రదేశంలో విస్తరించి ఉన్న ఈ వృక్షం ఏరియల్ రూట్లు భూమిపైకి వేలాడుతూ, సహజ స్తంభాలవలె కనిపిస్తాయి. స్థానికులకు ఇది సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు సహజ వేదికగా పనిచేస్తుంది. పక్షులు, కీటకాలు, చిన్న జంతువుల ఆవాసానికి ఆశ్రయమిచ్చి జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నది. స్థానిక చరిత్ర ప్రకారం ప్రతి సంవత్సరం ఇక్కడికి వేలాది పర్యాటకులు విచ్చేసి, ఈ ప్రకృతి విస్మయాన్ని ఆరాధిస్తారు. ప్రభుత్వం దీనిని ఒక సంరక్షక స్మారకంగా గుర్తించింది. 

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యా దగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దక్షిణ భారతావనిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది పంచముఖ న రసింహస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెం దింది. గుట్టపైకి 120 మెట్లు ఎక్కి చేరుకునే ఈ దేవస్థానం చరిత్ర చాళుక్యుల కాలానికి చెందింది. 2016లో ప్రభుత్వం దీన్ని రాజస్థాన్ మార్బుల్, బంగారుపూతలతో అలం కరించింది. ప్రధాన గర్భగుడిలో స్వయం భూ శిలారూపంలో నరసింహుడు, లక్ష్మీదేవి ఏకీభావంతో కనిపిస్తారు. ద్రవిడ, చాళుక్యుల వాస్తుశైలి మిళితమైన ఈ ఆలయం తెలంగాణలో ఆధ్యాత్మిక- పర్యాటక మహత్తును సార్థకం చేస్తున్నది. 

- వ్యాసకర్త సెల్: 9848445134