6 June, 2026 | 9:55 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

మన ఊరు.. మన బడి కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

26-11-2025 12:00 AM
  1. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ల ఆర్ధిక ఇబ్బందులు

భట్టి విక్రమార్కకి ఫోన్, లేఖ ద్వారా కాంట్రాక్టర్ల పరిస్థితి వివరణ

తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

చిట్యాల, నవంబర్ 25 (విజయ క్రాంతి):  తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తెలంగాణ శాసన మండలిలో  మన ఊరు- మన బడి కాంట్రాక్టర్లు కలిసి పెండింగ్‌లో ఉన్న తమ బిల్లులను ప్రభుత్వం త్వరగా విడుదల చేసేందుకు సహాయం చేయాలని వారు మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ వారి సమస్యలు తెలుసుకుని,  సానుకూలంగా స్పందించి వెంటనే రాష్ట్ర డిప్యూటీ సీఎం , ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తో ఫోన్ ద్వారా మాట్లాడి , రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు- మన బడి కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

అలాగే లేఖను రాసి కూడా డిప్యూటీ సీఎం కి  పంపించారు. మన ఊరు - మన బడి పనులు చేసిన వారు చిన్న కాంట్రాక్టర్లు అని, వారి బిల్లులు రాకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ శాసన మండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు.