calender_icon.png 26 November, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రథానికి పోలీసులు పూజలు చేయడం ఇక్కడి ఆనవాయితీ..

25-11-2025 10:23:13 PM

రథోత్సవంలో పాల్గొన్న ఎస్పీ మహాజన్..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ లోని ప్రాచీన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం రథంకు పోలీసులు పూజలు చేయడం ఆదిలాబాద్ లో ఆనవాయితీగా వస్తుంది. మఠం నుండి ప్రారంభమైన రథోత్సవం శోభాయాత్ర వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగుతోంది. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న వెంటనే వన్ టౌన్ మహిళ పోలీసులు మంగళహారతులతో వచ్చి రథానికి పూజలు నిర్వహించడం గత కొన్నిల్లుగా వస్తున్న ఆచారం. నేపథ్యంలోనే ఈసారి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రథోత్సవంలో పాల్గొన్నారు. రథానికి మఠాధిపతి యోగానంద స్వామితో కలిసి ఎస్పీ ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం భక్తులతో కలిపి రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.