calender_icon.png 11 January, 2026 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఆక్స్‌పర్డ్ విద్యార్థులు

06-01-2026 12:00:00 AM

చిట్యాల, జనవరి 5(విజయ క్రాంతి): మున్సిపాలిటీలోని ఆక్స్ పర్డ్ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికయిట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్ ఎంపిక పోటీలు జరుగగా అండర్- 10 విభాగంలో 300 మీటర్ల పరుగు పందెంలో నాలుగవ తరగతి విద్యార్థి సౌరవ్ మహాకుడ్,

అండర్ -14 భాగంలో 60 మీటర్ల పరుగు పందెంలో 6వ తరగతి విద్యార్థిని చింతకాయల నిత్య, 400 మీటర్ల పరుగు పందెంలో 3వ తరగతి విద్యార్థి విక్రాంత్, అండర్ - 14 విభాగంలో 60 మీటర్ల లాంగ్ జంప్ లో 8వ తరగతి విద్యార్థి సాయి ప్రణీత్ లు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలలో పాల్గొననున్నాతన్నారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు పెద్ది నరేందర్, వ్యాయామ ఉపాధ్యాయుడు కన్నెబోయిన లింగస్వామి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.