calender_icon.png 11 January, 2026 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు భరోసా కల్పించాలి

06-01-2026 12:00:00 AM

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్  అవినాష్ మహంతి 

ఎల్బీనగర్, జనవరి 5 (విజయక్రాంతి) : పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు పోలీసులు భరోసా కల్పించాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సూచించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టిన సీపీ, సోమవారం సరూర్‌నగర్ పీఎస్ పనితీరు, రికార్డులు, ప్రజా సమ స్యల పరిష్కారంపై ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, ఏసీపీ కృష్ణయ్యతోపాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.